(వి వి సర్ కుక్క చనిపోయిన పోయెమ్ చూసినంక నా ఇదుపుకాయితం సంకలనం లోని పెంపుడు పిల్లి చనిపోయినప్పుడు రాసిన పోయెమ్ .మీ కోసం.....) బంధం|| డా// కాసుల లింగారెడ్డి || 08-05-2014 తిరస్కృతవో బహిష్కృతవో దారి తప్పితివో పోరి వచ్చితివో ఓ! అనూహ్య అతిథీ! ఆహ్వానించని మిత్రమా! నువ్వు మా గూటిలో చేరావు మా గుండెలో దూరావు కరెంటు మీటరు బోర్డు పిచ్చుకకు బ్రతుకిచ్చినట్టే నడింట్ల నిలుపుకున్నరు నా బిడ్డలు కౌగిట్ల పెంచుకున్నరు పాలల్లో భాగమిచ్చిండ్రు ఇంట్లో జాగిచ్చిండ్రు బంతాట నేర్పిండ్రు బతుకు తీపి చూపిండ్రు ఒకే ఒక్క రెండున్నర గంటల ఎడబాటుకు భంగపడితివో కుంగిపోతివో ఇంటి లక్ష్మణరేఖ దాటితివి రాకాసి శునకం నోటపడితివి నిన్ను పోగొట్టుకున్న నాబిడ్డ మౌనరోదన నేనెట్లా భరించను? కలలో, మెలుకువలో నువ్వు వాడి కౌగిట్లో వున్నావన్న వాడి భ్రాంతిని నేనెట్లా తొలగించను? ఇప్పటిదాకా నిన్ను అయిష్టంగానే బిడ్డల కోసమే భరించిన నా అర్ధాంగి ఇప్పటి ఈ నైరాశ్య మౌనాన్ని నేనెట్లా ఛేదించను? నా ఇంట్లో నన్ను పరాయిని చేసిన నీ గడుసుతనం నేనెట్లా మరువను? ఒక తాదాత్మ్య మౌనభాష అభావం చెందింది ఒక మమతల బంధాల వంతెన కూలిపోయింది నువ్వంటూ రాకుండా వుంటే ఎంత బాగుండేది! ఈ దుఃఖ భారాన్ని మోసే బాధన్నా తప్పేది! (ఒక పెంపుడు పిల్లి దుర్మరణం తర్వాత) 18 ఆగష్టు 2011 'నేటి నిజం' దినపత్రిక.
by Lingareddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j6LKex
Posted by Katta
by Lingareddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j6LKex
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి