కవిత్వంతో కరచాలనం-6 దక్షిణ పవనం వీచెనోయీ!! పదహారేళ్ళ వయసులో అతనికి కవిత్వం బిగి కౌగిలి ఇచ్చింది. ఇప్పుడతని వయసు అరవై. జీవితంలో చాలా మజిలీలు వచ్చి వెళ్ళిపోయాయి. కొందరు దగ్గిరయ్యారు, చాలా మంది దూరమయ్యారు. కాని, కవిత్వం వొక్కటే అతని కౌగిలి వీడకుండా ఇప్పటికీ అతనితో వుంది. పదహారేళ్ళ వయసులో అమెరికన్ కవిత్వం వల్ల ప్రభావితుడై కలం పట్టాడు విజయ్ శేషాద్రి. ఆ కవిత్వం అతని మీద ఎంత గాఢమైన ముద్ర వేసిందంటే, ఇప్పటికీ ఆ పదహారు, పదిహేడేళ్ళ వయసులో చదివిన కవులూ వాళ్ళ కవిత్వాలే తనకి ప్రేరణ అంటాడు విజయ్. “ఇప్పుడు వాళ్ళల్లో చాలా మంది నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఎక్కడో వొక చోట కలుస్తూనే వుంటా. కాని, నాకు ఆ పదహారూ పదిహేళ్ళప్పటి వాళ్ళ రూపాలే ఇష్టం!” అంటాడు విజయ్ వొక చోట. అమెరికన్ కవి సమూహాలలో వొక భారతీయ స్వరం వినిపించడం అంత తేలికేమీ కాదు! ఈ మధ్య కాలంలో అమెరికన్ కవిత్వంలో ప్రవాస గొంతులు బలంగానే వినిపిస్తున్నప్పటికీ, ప్రధాన స్రవంతి అమెరికన్ కవిత్వంలో ఈ గొంతులు ఇంకా బలహీనమే! ఇక గుర్తింపు అన్నది సుదూరపు కల. అలాంటి పరిస్థితికి ఎదురీది, ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్న కవి విజయ్ శేషాద్రి. అరవై ఏళ్ల కింద బెంగళూరులో పుట్టిన విజయ్ అయిదేళ్ళ వయసు వుండగా అతని తల్లిదండ్రులు అమెరికా ప్రవాసం వచ్చారు. కాని, అమెరికా రాక ముందు గడిపిన ఆ దక్షిణ భారతీయ జీవితం ఇప్పటికీ విజయ్ కవిత్వంలో కనిపిస్తుంది. విజయ్ అంటాడు: “ఎవరూ అసలు చరిత్ర చెప్పలేరు. అసలేం జరిగిందో అసలే చెప్పలేరు. నా మటుకు నేను ఇప్పటిదాకా రాసింది ఎంత అయినా, చెప్పాల్సిన నా చరిత్ర ఇంకా మిగిలే వుంది.” విజయ్ శేషాద్రి ఇప్పటిదాకా మూడు కవిత్వ పుస్తకాలు ప్రచురించారు. మొదటి పుస్తకం wild kingdom 1996 లో, రెండోది Long Meadow 2003 లో, మూడోది 3 sections 2013 లో వచ్చాయి. ఈ మూడో పుస్తకానికే ఆయనకు పులిట్జర్ పురస్కారం దక్కింది. విజయ్ కవిత్వం కొంత తాత్వికంగా, కొంత రోజువారీ జీవితాన్ని కలుపుకొని పోయే మామూలు దృశ్యంగా కనిపిస్తుంది. అయితే, కవిత్వీకరణలో ఆ తాత్వికత కనిపించకుండా, తన ఉద్వేగాన్ని చెప్పుకుంటూ పోతాడు. ఉదాహరణకి ఈ కవిత: Dead friends coming back to life, dead family, speaking languages living and dead, their minds retentive, their five senses intact, their footprints like a butterfly’s, mercy shining from their comprehensive faces— this is one of my favorite things. I like it so much I sleep all the time. Moon by day and sun by night find me dispersed deep in the dreams where they appear. కవిత్వం ఏం చేయాలో ఇంకా మనకి తెలీదు. కాని, మనిషి జీవితంలోని irony ని, వొక షేక్స్పియర్ లాగా, వొక ఎలియట్ లాగా చెప్పగలిగే కవులు ఎప్పుడో కానీ రారు. దాదాపు అదే వొరవడిలో నిలిచే కవిత The Descent of Man. ఈ కవితలో విజయ్ అంటాడు: My failure to evolve has been causing me a lot of grief lately. I can't walk on my knuckles through the acres of shattered glass in the streets. I get lost in the arcades. My feet stink at the soirees. The hills have been bulldozed from whence cameth my help. The halfway houses where I met my kind dreaming of flickering lights in the woods are shuttered I don't know why. ప్రతి కవీ వొక కాలంలో బతుకుతూ మళ్ళీ తనదైన ఇంకో కాలంలో కూడా బతుకుతూ ఉంటాడు. అందుకే కవి జీవితం కనాకష్టం. కనిపించని శిలువలని మోస్తున్న చరిత్ర భారం. వొక అపరిచితమైన ప్రపంచం మన చుట్టూరా విచిత్రంగా కదులుతూ వుంటుంది. తన కుటుంబం గురించీ, అందులో తన స్థానాన్ని గురించి వొక చోట అంటాడు విజయ్: We were strange. We were doubly strange; strange because Indians are strange even in India, having been exiled from time and history by an overdeveloped, supersaturated civilization, and strange also because no one remotely resembling us had ever before lived where we lived. But I was the only person in my family beset and burdened by this strangeness. విజయ్ శేషాద్రి కవిత్వం వొక ప్రవాసి ఆత్మకథనం – కాకుంటే, ఈ ప్రవాసానికి భౌతికమైన ఎల్లలు లేవు.
by Afsar Afsar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uCUySW
Posted by Katta
by Afsar Afsar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uCUySW
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి