పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

Rambabu Challa కవిత

చల్లా గౙల్/Dt.22-5-2014 మాటిమాటికి చిరిగే పరువును కుట్టినా ఏంలాభం మించిన బరువుకు ఒరిగే పశువుని కొట్టినా ఏంలాభం రేయింబవలు నిదురే హాయని గదిలో గడిపేస్తూ చీకటి బ్రతుకని వెలుగే లేదని తిట్టినా ఏంలాభం కాకాపట్టి బిరుదులకొసం కాళ్లని పట్టేస్తూ ఊహల రాళ్లతో గాలిలో మేడలు కట్టినా ఏంలాభం పేదల ఆకలి తీరుస్తానని బాకా ఊదేస్తూ ఆకలి చావుకి దండలు వేసి మొక్కినా ఏం లాభం అరటిచెట్టుకి గెల ఒకటైనా ఎంతో మధురం "చల్లా" పదిమందైనా మూర్ఖపు తనయులు పుట్టినా ఏంలాభం

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jFiSQN

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి