పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

Rajender Kalluri కవిత

## గాలిపటం కాదు జీవితం ## ఎగిరే గాలిపటానికి తెలిదు , ఎందాకో తన పయనం వెన్నంటే ఉండే దారానికి తెలిదు ఎంత కాలమో తన సహాయం పట్టుకునే పసివాడికి తెలిదు తన పంథా ఏమిటో ఐనా సరే పట్టుకున్న దారాన్ని , ఎగిరే గాలి పటాన్ని చూసి మురిసిపోతుంటాడు !! నేను అంతే .. బాధను అనుభవిస్తున్నా, మెరిసే వాళ్ళ నవ్వుని చూసి మురిసి పోతుంటాను ఎందుకో తెల్సా ? "జన్మ " నిచ్చింది వాళ్ళే కాబట్టి ! అమ్మ నాన్న ల ఆనందం కోసం ఇష్టం లేని చదువు చదివి , ఇష్టం లేని పని చేస్తూ నీకేదిష్టం అని అడిగితే మా అమ్మ- నాన్న ల ఇష్టం అని చెప్పడమే తప్పితే నాకంటూ " ఇష్టం " లేకుండా పోయింది నా జీవితంలో గాలి పటాన్ని ఎగరేయాలనుకోవడంలో తప్పు లేదు . కాని ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతున్నాడు అని తెల్సినా ఇంకా తన చెప్పు చేతల్లో ఉంచాలనుకోవడమే ప్రతి తల్లిదండ్రులు చేసే మొదటి తప్పు ! " ఈ పోటి ప్రపంచంలో అవకాశాలు లేక మేము వెనకబడి పోవట్లేదు మీ వళ్ళ కాదేమో అనే మీ సందేహమే మమ్మల్ని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి " దయ చేసి " తల్లిదండ్రుల " స్థానం లో ఉండి మీరు ఆ తపు చేయకండి kAllURi [ 22 - 05 - 14 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n1nUHl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి