పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

Kavi Yakoob కవిత

యాకూబ్ || ఒక జ్ఞాపకం .................................. ఈ జీవితాన్ని ఖాళీచేసి వెళ్లిపోతున్నప్పుడు ఒక జ్ఞాపకం కావాలి . అలిసిపోయిన గుండెను సుతారంగా తట్టేందుకు నెత్తుటి చుక్కల్లో కరిగిన ఒక అక్షరం కావాలి. అనుభవంలో తడిసిన ఈ చిత్తడి జీవితానికి చిదుగుల్లాంటి ఒక స్పర్శ కావాలి . 1 తుమ్మచెట్టుమీద చివరి నిమిషం దాకా గడిపిన క్షణాన్ని వర్షం చినుకు కూడా చెప్పుకోదు. ఎండిన శరీరంమీద పచ్చటి జీవితాన్ని కప్పుకుని గుండెను విప్పినా - ఎక్కడా ఒయాసిస్సు కనిపించదు. వేలవేదనల్ని ఏటిలో పారేసి బయటపడ్డా చీకటితెర కమ్ముతూనే ఉంటుంది. 2 రెండూ చేతులూ ఎంతకీ దొరకవు . బాధగా మెలితిరుగుతున్న ఏకాంతం గదిలో ఎన్నిసార్లు వెతికినా ఒక్క జ్ఞాపకమూ కనిపించదు. పగిలి ముక్కలైన ఒకానొక జ్ఞాపకాన్ని మాత్రం -నిమురుతూనే ఉంటుంది దు:ఖం . * ఈ జీవితాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్నప్పుడు ఒక జ్ఞాపకం కావాలి. # *పాతవాచకం : ప్రవహించే జ్ఞాపకం : 1992

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ohUmES

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి