పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

Swatee Sripada కవిత

లోలోని చుక్కాని ముసురు పట్టిన సాయంత్రాలు రెక్కల్లేని మబ్బు ముక్కల్లా ప్రవహిస్తూ వచ్చి ఘనీభవించిన ఉనికి చుట్టూ మూగినప్పుడు ఒక నిర్వికార సమాధి స్థితిలో గాలివాటుకు సాగిపోయే సుకుమారపు నెమలీకలా అచేతనంగా కడలి వెడుతూ నిశ్శబ్దపు నీటి చుక్కలు ఉండీ ఉండీ ఎండి పొడి బారిన గుండె తడిపి నిప్పులగుండపు గుండె ఆవిరులను అదిమి పెడుతూ ఇంకా సందేహమే ! ఏటివాలు గిరికీల మధ్య అటూ ఇటూ ఊగిసలాడే అనిశ్చయ సజీవత మధ్య ఏది మరుగున పడని గతమో ఏది వెలుగు చూడని స్వగతమూ ఏరువాక పున్నమ వెలుగో ,ఏది కొత్త అమవస తోలిదినమో సగం సగం స్వప్నాల మధ్య ధడాల్న తెల్లవారినట్టు ఎప్పుడు ఉదయిస్తుందో తెలియని ఒక నిరంతర రాత్రి అన్వేషణ ఏ పట్టు సడలి ఏ అగాధాలు ఆవిష్కరణకు సంసిద్ధమో విముఖమో అర్ధం కాని ఒక లోలకపు ప్రతిబింబం చెప్పేందుకు చీకటిని హత్తుకున్న పెదవులు మూగవోయి స్వరం పూడుకు పోయిన మాటల అస్తిత్వం నైరూప్య చిత్రాల ప్రవాహంలా లోలోనికి అంతర్ముఖమై ఉక్కిరిబిక్కిరయే ఊహలకు ఊపిరులందిస్తూ లోలోపలి ఒక మిణుగురు ఆశ అదే కదా జీవన పయనానికి చుక్కాని

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lS9g2h

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి