పూర్తిగా పర్సనల్ - కాసుల ప్రతాపరెడ్డి చిన్నోడు అమ్మ పెట్టిన ముద్దును నా చెంపలపై అద్దుతాడు నాయినమ్మ కొప్పును, రైకను పెన్సిల్‌తో రూపు కడతాడు పెద్దోడు, నిజానికి చిన్నోడు అచ్చం అమ్మలెక్కనే మనసంతా దాచి మమతను కోరుతాడు ఆమె కూడా అంతే దగ్గరికొస్తే విసిరికొడుతుంది విసిరి కొడితే దరి చేరుతుంది ముగ్గులేసినా, మాల కట్టినా నాకోసమేనే తల్లీ! ఎవరో, ఎవరెవరో, మరెవరో వస్తుంటారు, పోతుంటారు ఏదేదో అంటుంటారు ఏదీ యాదికుండది విన్నట్టూ, విననట్టూ.... పోతుంటాం, వస్తుంటాం మాటలు కూడా అడుతుంటాం ఏదీ ఉండదు, ఏదీ మనసుకంటదు మనసొక్కటే, మమత ఒక్కటే మళ్లీ మళ్లీ మొదటికొస్తది చెంపలపైనో, పెదవులపైనో ముద్దొక్కటే మిగులుతది నెత్తి కురులను నిమురుతూ చేయొక్కటే కదులుతూ ఉంటది గుండెలు రెండూ దేహం మీద తచ్చాడుతూ ఉంటయి లోకమంతా నిదురోయి నేనొక్కన్నే మేల్కొని ఉంటా రాలిపోయిన పసితనమేదో తిరిగి ఆవహిస్తూ వుంటుంది
by Pratapreddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kEJpwK
Posted by Katta
by Pratapreddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kEJpwK
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి