నీ నిజాయితీకి నెత్తుటి మరకలున్నా, నీ కీర్తనతో నా రక్తం మరగదెందుకు? విజయోన్మాదంతో నువ్వు వికటాట్టహాసం చేస్తుంటే, నీవెవరో మరువని నా మనసు గొంతెత్తి అరవదెందుకు? ధనమరిగిన పొట్టలూ, ధనమెరిగిన మెదళ్ళూ, ధనం మరిగిన నీ మిత్రులూ నీ చేత కవిత్వాలు చదివిస్తుంటే, నా హృదయ కుడ్యాలు పగలవెందుకు? నీ కక్ష్యలు వీక్షిస్తూ, నీ భక్షణ కాంక్షిస్తూ, నీ శిష్యులు కక్షలలో నీ చుట్టూ పరిభ్రమిస్తుంటే, నా చక్షువుల నిప్పులు రాలవెందుకు? బహుశా మనిషిగా, నే చనిపోయి చాలా రోజులయిఉండవచ్చు! బానిసగా నే మిగిలిపోవడం చాలా నిజమయి ఉండవచ్చు! కానీ, ఒక్కటే సందేహం! నీ అబద్దాల సంద్రంలో ఒక భయానక నిజం దాగుందేమో? నీ అవినీతి రక్తం నా గుండెలో కూడా ప్రవహిస్తుందేమో? నా మీద తొలిసారి నాకే అసహ్యం! నీ విలువల్లేని అభివ్రుద్ధి కోసం అర్రులు నేనూ చాస్తున్నానేమో? "ఒక మందమతి"
by Mukharjee Madivada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S8lKdf
Posted by Katta
by Mukharjee Madivada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S8lKdf
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి