పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మే 2014, సోమవారం

Kamal Lakshman కవిత

తెలియక చేసిన పొరపాటు... నా జీవితం లో తెలిసి తెలియక చేసిన ఒక తప్పుకు కాదు.. కాదు .. ఒక్క పొరపాటుకు అదీ నా ప్రమేయం లేని గ్రహపాటుకు ... ఎటూ తేల్చుకోలేని ఏమీ పాలుపోలేని మానసిక పరిపక్వత పూర్తిగా సంతరించుకొని నిస్సహాయ స్థితిలో తీసుకున్న నా నిర్ణయం అడుగడుగునా ... ప్రతి క్షణం.. అనుక్షణం.. ఇంత చిత్రవధకు గురిచేస్తుందని ఊహించకపోతిని పండంటి జీవితం ఇలా..... అడవిగాచిన వెన్నెలలా మోడు వారిన మానులా గమ్యం లేని గాలిపటంలా కన్నీటి ధారలుగా అశ్రు నయనాలతో ఇలా ఎంత కాలమో ఇంకెంత కాలమో ఏమో ...ఏమో...ఏమో... కమల్ 26.05.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mfLAFh

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి