పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మే 2014, సోమవారం

Abd Wahed కవిత

ఎండ ఎండుటాకులా రాలుతోంది మిట్టమధ్యాహ్నం రోడ్డును కావలించుకున్న తారులా కాంక్రీటు అడవిని హత్తుకుంది వెలిసిపోయిన మనిషిరంగులా మిగిలింది నగరం ఎండమావి కాదు...కాదు... దూరాన.. నేలను ముద్దాడే ఆకాశం వైపు దుమ్ము దుస్తులు తొడుక్కున్న బాధలు అలలు అలలుగా కదులుతున్నాయి కాల్చే ఎండలో కరుగుతున్నాయి పొగమంచులా ఏ.సీ.రూములకు చల్లదనం ఇస్తున్నాయి... కాంక్రీటు అరణ్యం వెలిగిపోతోంది వెలుగు వానలో తడిసిపోతోంది కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి తోటి మనిషి కనబడని వెలుగు... మనిషి మనిషికి మధ్య ఎడబాటు గోడలా వెలుగు తెరలు... ఆవిరైపోయిన కంటితేమ నిస్త్రాణగా చల్లని చీకటి కావాలంటోంది... ఇక ఆలోచించడానికేముంది? అంతా వెలుగుమయమే కదా... నీడను కూడా తరిమేసిన వెలుగు... భరించరాని ఉక్కపోతలో చెమటలా ఆత్మను కమ్ముకుంది ఒంటరితనం. కాస్త కళ్ళు విప్పి మనసారా మనిషిని చూడాలి నల్లసుందరి, చీకటికన్య, రాత్రి ప్రేయసి చిరునవ్వు కురవాలి. ఇంత వెలుగు భరించలేం.. మిట్టమధ్యాహ్నం ఎండలో ఎండమావుల్లా ఎంతకాలం?

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1owSGYb

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి