పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మే 2014, సోమవారం

బాలసుధాకర్ మౌళి కవిత

రైల్లో 3 గొంతును వేణువుగా చేసుకున్నాడు గొంతువేణువులోనే సప్తస్వరాల్ని మించిన విన్నూత్న రాగాన్నేదో పలుకుతున్నాడు మాటలకు అందనిది - జీవన విషాదం నుంచొచ్చి దుఃఖం వాసన వేస్తున్న రాగం బహుశా అలానే వుంటుంది కాబోలు అతను నిజంగా యోధుడు - రైల్లో అస్తవ్యస్తంగా పడివున్న దేశపటాన్ని కలిపి కుడుతున్నాడు అందర్నీ ఏకత్రాటిపై నిలబెడుతున్నాడు కళ్లు లేకపోయినా అతని బతుకుదారికీ గొంతే కన్ను రోజూ సూర్యుడతని ముందు ఓడిపోతూనే వున్నాడు ఉదయం తరగలు తరగలుగా పోటెత్తుతున్న ఉత్సాహం గుర్రం మీద కనిపిస్తాడు సాయంత్రమూ అదే గుర్రంపై అదే తీరుగా కనిపిస్తాడు ఆ స్వరచక్రవర్తి - వొక రోజును వొక రాగంగా తీర్చిదిద్దుతున్నాడు ! రచనా కాలం : 26 మే 2014 --------------------------------- 26.05.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mfLzkx

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి