## నా భాష - నా ఇష్టం ## Sraight గా మాట్లాడితే , హే నువ్వు ఆంధ్రానా అంటారు గట్ల గాదు పోరి అంటే .... ఎంటా లాంగ్వేజ్ అంటాండ్రు మా బాషను మాట్లాడనియ్యకపాయే , మా పొరలు , పోరగాండ్లు మా యాసను , బాషను మర్చిపోయే ! దీంతల్లి...గెట్ల మాట్లాడినా గసంత గుస్సా జేస్తాండ్రు నోరు పెద్దగుందంటరు , ఊకె మొత్తుకోకంటారు గింతకి నాక్ దేల్వకడుగుతా ...... ఆడు తెలంగానంటడో , ఈడు ఆంధ్రానే అంటాడో , మీరు-మీరు తన్నుకొండి , గుద్దుకొండిబై నడిమిట్లా నా బాషెం జేసింది? " సిన్మా లల్ల , పైసల కోసం , గా తుగ్గ్లగ్ గాన్ మాదిరి వాడుకుంటున్నరు " గీ దిమాక్ లేని పబ్బ్లిక్ గిట్ట కిలకిల నవ్వేస్తుండ్రు ! మా బాశంటే అట్టి రౌడి యిజమేనా ? మా బాశాలున్నన్ని కథలు , పద్యాలు మీ ఒద్దనున్నయానల్ల ? మా ప్రాంతంలున్నంత మంది రచయితలు , ఒగ్గు కళాకారులు మీకాడున్నరా ? మాకాడున్నన్ని కళలు మీకాడున్నయా ? " గది మా బాష - గట్లనే ఉంటది మా యాస " జర్రంత కిందికి మీదికైతే...లే.. కొడకా .....గట్టిగ ఈల గోడితెలే ,మీ ఉళ్ళ గూసున్న మీ అవ్వకినపడాలే మా గొంతు తస్మాత్ జాగ్రత్త --- జరకంత గుర్తున్చుకొండ్రి ... మా సాహిత్యం మాకున్నదని ! మా బాషకంటూ ఓ నేపద్యం ఉన్నదని గింతకు గీ లోల్లంత మీకెందుకు జెప్పిన్నో సమజైందా...? పక్క ఉళ్ళ నాక్ పెండ్లి సూపులని వోతే ... గా పెండ్లి పిల్లకు నేను మాట్లడతాంది నచ్చతలేదట , కయ్యుమని అరవకు పొరగా అన్నది....రయ్యుమని మా ఇంట్ల వడ్డ గాన్నుంచి జార్కొనచ్చి . ఇంకేవల్తో జెప్పుకోవాలే నాకష్టాలు గందుకే మీకు జెప్తున్న ఇంటే యినుండ్రి లేదంటే గాలికోద్లేయండి !! ఇట్లు సిద్దయ్యా ( సిరిసిల్ల ) Written by " kAlluRi " [ 26 - 05 - 2014 ]
by Rajender Kalluri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RreR66
Posted by Katta
by Rajender Kalluri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RreR66
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి