పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఏప్రిల్ 2014, శనివారం

Ravela Purushothama Rao కవిత

కవిత్వమంటే----- ********************** కవితా రాణి పాదాలకు మళ్ళీ పారాణి పూతలను పూద్దాం మళ్ళీ ఆ మహా సాధ్విని అమందానంద కందళిత హృదయారవిందనుగా తీర్చి దిద్దుదాం. కవిత్వమంటే ప్రవహించే ఓ సుమధుర జ్ఞాపకమనీ ఎప్పటికీ చెరిగిపోని పుట్ట్టుమచ్చనీ అందరికీ విదితం చేద్దాం. కవిత్వమంటే నిత్య వసంతమనే నిజాన్ని నిలువెత్తు సాక్ష్యంగా నిరూపణ చేద్దాం కవిత్వమంటే ఒక పచ్చని పైరు పంటయనీ దాని మీదనుంచి వీచే చల్లని గాలీ మెత్తని స్పర్శా కవిత్వమేనని ప్రతిపల్లెకూ పట్టణానికీ దండోరావేస్తూ చాటిద్దాం. నిబద్ధతకూ నిజాయితీకీ నిండు ప్రాణంగా నిలిచే సత్స్వరూపం కవిత్వమేనని గల్లీ గల్లెలోనూ గళమెత్తి పాడుదాం.

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tj6Uiv

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి