పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఏప్రిల్ 2014, శనివారం

Srinivas Vasudev కవిత

"మిస్టీరియస్ మరణమే కవితా వస్తువు" కవిత్వం రాయని వారికీ, కవులకీ తేడా ఏంటని అడిగితే 'కవిత్వం రాయటమే' అని మీరు నాటీగా జవాబు చెప్తారు. కానీ అదికాకుండా ఇంకా ఏవైనా కారణాలుంటాయా? ప్రలోభాలకీ, ఆకర్షణలకీ అతీతంగా ఉండగలగటమో, ఎక్కడికెళ్తే అక్కడ ఏదైనా వస్తువు దొంగతనం చెయ్యాలనో, స్వలింగ సంపర్కలుగా తయారవ్వటమో లేదంటే తరచూ ఆత్మహత్య చేసుకోవాలనే విపరీతవైఖరీ లాంటివాటికి కవులో, కవుల్లాంటివారో అతీతంతా ఉండాలా? సాధారణ వ్యక్తులు కవుల్నించీ ఏదైనా ప్రత్యేకత ఆశిస్తారా? అలాంటివేమీ ఉండాల్సిన అవసరంలేదనే అనిపిస్తుంది కొంతమంది కవుల్నీ, కవయిత్రుల జీవితాన్ని చదివితే. ఇరవై ఏళ్లకే 46 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడి ఎలాగోలా బయటపడినా ముప్పై ఏళ్ళకి మళ్ళీ మరోసారి --జీవితంలో చివరిసారిగా-- ఆత్మహత్య చేసుకుని మరణించిన ప్రముఖ అమెరికన్ కవయిత్రి Sylvia Plath (1932–1963). Academic, Poet, Author, Editor. ఎవరూ, ఈమేనా ఇవన్నీ అని ఆశ్చర్యపోకండి. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంకొన్నాళ్ళు బతికుంటే ఈ రోజు అమెరికన్ సాహిత్యంలొ మరెవ్వరీ రచనలూ చదివేవారు కాదు అంటారు. అక్టోబర్ 27, 1932 లో అమెరికాలోని మెసాచ్యుసెట్స్‌‌లో జన్మించిన సిల్వియా ప్లాత్ చిన్నప్ట్నుంచే రాసేది. ఆమె రచనలు వెనువెంటనే ప్రాచుర్యం పొంది పధ్ధెనిమిదేళ్లకే ఆమెకి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం స్కాలర్‌‌షిప్ లభించటంతో స్మిత్ కాలేజీలో విద్యాభ్యాసం కోసం వెళ్లాల్సివచ్చింది. అక్కడే ప్రముఖ ఆంగ్ల కవి Ted Hughes ని ప్రేమించి పెళ్లాడినా ఆమె వైవాహిక జీవితం పూర్తి ఒడిదుడుకులతోనే సాగి అర్ధాంతరంగానే ముగిసింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా విడాకులు తప్పలేదు. 1960 లో ఆమె తన మొదటి కవితాసంపుటి "The Colossus" ని ప్రచురించుకుంది. సిల్వియా ప్లాత్ తన సాహితీప్రస్థానంలో కేవలం ఒక్కటంటే ఒక్కటే నవల రాయటం జరిగింది "The Bell Jar" అన్న పేరుతో. ఆమెకి ఆ నవల అమితమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టింది. ఎప్పుడూ ఆత్మహత్యోన్ముఖురాలైన సిల్వియాకు భర్త టెడ్ హ్యూజస్ వివాహేతర సంబంధం ఆమెని మరోసారి కృంగదీసింది. విపరీతమైన డిప్రెషన్‌‌లో ఫిబ్రవరి 11, 1963 న ఇంట్లోని గ్యాస్ ఒవెన్ ని ఉపయోగించి మరీ హృదయవిదారక పధ్ధతిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది. **** ఆశ్చర్యంగా ఆమె భర్తే ఆమె రచనల్ని సేకరించి మరో సంపుటి " The Ariel" ని 1965 లో ప్రచురించాడు. మరణానంతరంగా 1982 లో ఆమె కవిత్వానికి పులిట్జర్ ప్రైజ్ దక్కింది. సిల్వియా కేవలం ముప్పైఏళ్లకే తనువు చాలించినా ఆమె బ్రతికుండగానూ, మరణానంతరమూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఏకైక అమెరికన్ కవయిత్రి. చాలావరకూ ఆత్మకథ అనబడే ఆమె ఏకైక నవల "The Bell Jar" ఆమె మానసిక ఒత్తిళ్లలో రాసినదే. మరణం గురించీ, ఆత్మహత్య గురించిన ప్రస్తావన ఈమె కవితల్లో తరచుగా విన్పట్టం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఐతె కవితా వస్తువును ట్రీట్ చేసిన విధానం ఆమెని ముందువరుస కవయిత్రుల్లో నిలబెడుతుందనడంలో అతిశయోక్తి లేదు. మరణం సిల్వియాకి ఓ స్వీయభావావరోధం (obsession). మరణాన్ని అన్ని రకాల కోణాల్లోంచి విశ్లేషించి, ధ్యానించి, పరిశీలించి మనకందిస్తుంది. బహుశా మరే ఇతర కవుల కవిత్వంలోనూ ఇంతగా ఒకే వస్తువుని ఆదరించిన దాఖలా కన్పడదు. ఆమె రాసిన కవితలన్నీ ప్రాచుర్యం పొందినవే. వాటిల్లో ఇదొకటి. ఈ కవితకి ముందు ఓ నోట్ లా ఇచ్చిన వివరణ ఆమెకి కవిత్వంపై ఉన్న మమకారాన్ని చెప్పకనే చెప్తుంది. All the Dead Dears by Sylvia Plath In the Archæological Museum in Cambridge is a stone coffin of the fourth century A.D. containing the skeletons of a woman, a mouse and a shrew. The ankle-bone of the woman has been slightly gnawed. Rigged poker -stiff on her back With a granite grin This antique museum-cased lady Lies, companioned by the gimcrack Relics of a mouse and a shrew That battened for a day on her ankle-bone. These three, unmasked now, bear Dry witness To the gross eating game We'd wink at if we didn't hear Stars grinding, crumb by crumb, Our own grist down to its bony face. How they grip us through think and thick, These barnacle dead! This lady here's no kin Of mine, yet kin she is: she'll suck Blood and whistle my narrow clean To prove it. As I think now of her hand, From the mercury-backed glass Mother, grandmother, greatgrandmother Reach hag hands to haul me in, And an image looms under the fishpond surface Where the daft father went down With orange duck-feet winnowing this hair --- All the long gone darlings: They Get back, though, soon, Soon: be it by wakes, weddings, Childbirths or a family barbecue: Any touch, taste, tang's Fit for those outlaws to ride home on, And to sanctuary: usurping the armchair Between tick And tack of the clock, until we go, Each skulled-and-crossboned Gulliver Riddled with ghosts, to lie Deadlocked with them, taking roots as cradles rock.

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hUr9PZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి