//సముద్రం// నింగి నేల ఏకామవ్వాలన్నట్లు సంద్రం ఆకాశంతో స్నేహాన్ని కోరుతుంది అలల హస్తాలతో ఆత్రంగా సంద్రంపై ప్రసరిస్తూ కిరణాల వెలుగులు మేఘమై మెరవాలని ఆకర్షిస్తున్నట్లుగా హద్దులు లేని కోరికలకు నింగి అర్దం చెపుతుంది అలవికాని అలొచనలకు నేల సమాదానం చెపుతుంది అలుపెరుగని అలను చూసి కొత్తపాఠం నేర్చుకో ఓటమి ఎదురైనా మున్ముందుకు దూసుకుపో కెరటం తుడిచేస్తూ పాదాల గుర్తులు గతం మరచి నడవమని గుణపాఠం చెపుతుంది కడలి ముందు కూర్చుంటే కలత చెదిరిపోతుంది మనసు ఓదార్పుకు తరంగం తోడవుతుంది ........వాణి కొరటమద్ది 29/3/2014
by Vani Koratamaddi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fvze7R
Posted by Katta
by Vani Koratamaddi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fvze7R
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి