పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, మార్చి 2014, శనివారం

Bhaskar Kondreddy కవిత

kb ||అల్టిమేట్|| అన్నా! నువ్వూ అంతేనా? నేనేదో కలగన్నానే, నేనేదో ఊహించానే నీ పొత్తిల్లలోని పసిబిడ్డలులాంటి ఆలోచనలు చూసి నేనేదో అనుకున్నానే, నువ్వూ,… అంతేనా అన్నా! పడితే పడ్డావు కాని, కాళ్ల ముందు బోర్లా అన్నా, వదులుకోకు ఉన్న వ్యక్తిత్వాన్ని గాయపరుచుకోకు, నీ మానసిక సౌందర్యాన్ని. మనకున్న తెంపరితనాన్ని చూసి మురుస్తున్నప్పుడు, అన్నా, నాకో ఆనందం వుండేది, ఒకే కడుపున పుట్టకపోయినా, వీడున్నాడురా, నాకు అని, మారుతున్న క్రమాన్ని చూస్తున్న తరువాత, అన్నా! దాన్ని దుఃఖమనలేను కాని. సంతోషమని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. ఎదుగుతున్న తీరుని చూసి, దాన్ని పతనమనలేను కాని, ఖచ్చితంగా అది అధిరోహించడమనలేను. సరే, మాటలదేముందని, మర్మగర్భంగా నవ్వుకోవచ్చు నీవు. సరే, రాతలదేముందిలేనని తెలివిగా బాటలేసుకోవచ్చు నీవు. ఎంతటి గాఢతలైన, పరిస్థితిలను బట్టి పల్చబరుచుకునే, ఓ పసరవేది లాంటి విద్యను వంట బట్టించుకున్న తరువాత, ఇప్పుడిక అసలైన ఆల్కెమి అర్థమైపోయిందన్నా, నీకు. అన్నా, విధానలదేముంది కాని, విలువలదేముంది కాని,. ఇంకా ఏదేదో అనుకుంటూ, మింగలేక, కక్కలేక ఓ వెర్రినవ్వుతో వెక్కిలి పుండై మిగిలాక నేను,. అన్నా,. ఇక జీవితం కూడా వుండదన్నా,. వుండదు. నీకైనా, మరి ఇక నాకైనా,. ఇద్దరమూ, ఒక్కరైన ఏవో కొన్ని క్షణాలకైనా. -------------------------------------------------29-03-2014

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k1Qogx

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి