నిశీధి | Alexander the dumb | అక్రోస్టిక్ పోయెమ్ రాసారో లేదా ఆక్రోశమే వెళ్ళగక్కారో కాని ప్రపంచం ని జయించిన విజేత చేతులు ఖాళీగా పరలోకం కి పయనం సాగిస్తున్నాయని సమాధి బయటకి జాపి పెట్టిన నీ రిక్త హస్తాలు ఎన్ని మార్లు ఎంత మందిని హెచ్చరించినా సికంధర్ .. మా చేతులు ప్రపంచాన్నే చుట్టేసేందుకు ఉవ్విల్లూరుతూనే ఉంటాయి ఎప్పటికి . కోరికే కూడదన్న తీరని కోరికతో కళ్ళు మూసిన సిద్ధార్ధుడు టెన్నిసన్ యులిసిస్ లో బ్లాంక్ వెర్స్ గా మిగిలిపోతే బ్లాక్ మనీ తో సిద్దయోగం మాకు భావప్రాప్తిని ఇస్తుంది శ్వాసల్లో మోహావేశం గ్రీష్మాన్ని సైతం కాలుస్తుంటే కామపు యాగవాటికలలో కాలిన బూడిద తో మాకు శివోహం సిద్ధిస్తుంది . బచ్ కే రహెనా హమ్ సే ఇహం పరం అంతా “జింతాత “ సమాసాలలో కిర్రెత్తి పోయి జాంబీ వేషంలో వెర్రి అరుపులు అరుస్తుంటే మా రక్తం నీరైపోయిందేమో నిర్ఘాంతపోతున్నావా పిచ్చి సికంధర్ ... శవాలకి రక్తం రంగు తో హోలీ లే తప్ప ఉరకలెత్తే వేడిరగతం ఎక్కడుంటుందయ్యా ? లక్ష చావుల నుండి లక్షల విలువయిన ఆలోచన ఒక్క దాన్ని ఒడిసిపట్టుకుందాం అనుకున్నా బ్రతుకు నుండి పారిపోయి మాది అనుకున్న శరీరంలో మక్కువ గా బ్రతికేసే బలహీన జీవులని క్షమించేసి నీదైన సమాధిలో ప్రశాంతంగా చుక్కలు లెక్కబెడుతూ నిదురపో . నిశీ !!! 29 – 03 – 14
by బ్రెయిన్ డెడ్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f1mLMy
Posted by Katta
by బ్రెయిన్ డెడ్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f1mLMy
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి