తిలక్/స్పురిస్తూ నేను ---------------------------- ఇక నిన్ను ముగిద్దామని చూస్తుంటే అనంతమయ్యావు మనసు పొరల్లో చెమ్మగిల్లిన దారులన్నీ నీ గురుతులే ప్రకృతి అంతటా నీ వదన కుసుమాలే అల్లుకుపోయాయి నీ ఊహల తరంగాలు మది దర్పణం గుండా ప్రసరిస్తున్నపుడు వక్రీభవించని నా చూపుల కోణాలను లెక్కించేదెలా ఆరాధనో ఆవేశమో మోహమో వ్యామోహమో నిలువెల్లా కమ్ముకున్న ప్రేమ పొర చలించే కాలంలో కొన్ని జ్ఞాపకాలుగా మిగిలే ఉన్నాయి ఇంకా. తిలక్ బొమ్మరాజు 05.03.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P2kEyM
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P2kEyM
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి