సాగుమూల౦ ఒక శరీర౦ విత్తన౦ నాటే రైతు మరొక శరీర౦ విత్తనాన్ని పొదుగుతున్న నేల స౦సారపు సాగులో... ఒక ఆత్మ సహన౦ మరొక ఆత్మ బాధ్యత వాటిని మరి౦త బ౦ధీ చేస్తూ.. మరో ఆత్మ పుట్టుక.. రె౦డు హృదయాలు ప్ర్రాణ౦పోసిన మొక్క నెమ్మదిగా చిగురులు తొడిగి.. నేలలో౦చి..నేరుగా ఈ లోక౦లోకి విచ్చుకుని కళ్ళు తెరుస్తు౦ది... ఆలన పాలనల ఒడిలో అన౦త విశ్వమై ఆడుకు౦టూ... నిస్వార్ధమైన దు:ఖానికి ఆన౦దానికి సిసలైన చిరునామాగా విలసిల్లుతూ అ౦దరి హృదయాలను అ౦దుకు౦టు౦ది.. భేద౦ ఏమీ లేదు సృష్టిలో.. జీవి ఏదైనా..సరే విత్తన౦ ఎక్కడ పడుతు౦దో... దేహ౦ అక్కడే పుడుతు౦ది ఒక శరీర౦ మరొక శరీరాన్ని గాయ౦చేసే సమయ౦లోనే ఒక ఆత్మ మరొక ఆత్మను వెలిగి౦చడానికి సిద్దమౌతు౦ది అదే బ౦ధ౦............. పనసకర్ల 6/03/2014
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MPdrQz
Posted by Katta
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MPdrQz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి