పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మార్చి 2014, గురువారం

Swatee Sripada కవిత

ఇంకేం చెయ్యను? మాటల్లేకుండా మౌనయుద్ధం చేద్దమనుకు౦టానా కొంగట్టుకులాగి వెనువెంటే తిరిగే తప్పటడుగుల బుడిబుడి నడకల పాపడి పలవరి౦తల్లా నీ తలపులు నిశ్శబ్దాన్ని సాగదీసి నీకూ నాకూ మధ్యన గాలివంతెన వేద్దామనుకు౦టాను రివ్వురివ్వుమంటూ అటూ ఇటూ పరుగులుపెడుతూ హోరెత్తించే ప్రవాహమవుతు౦ది అదృశ్యంగా నీ ఉనికి మంకు నేర్చిన చిన్నరిలా దొర్లిదొర్లి మారాం చేసే మనసును గట్టిగా కసిరి ఓ మూలను౦డమని గదుముతానా కళ్ళనిండా నీళ్ళు నింపుకు ఎర్రబడ్డ కళ్ళను వేళ్ళవెనకవైపుతో తుడుచుకునే చంటి కూనను ఓదార్చే మెత్తని చేతుల్లా నీ మాటల ప్రతిధ్వని 2. నిజమే అయినా కష్టంగానే ఉంటుంది అనుక్షణమూ దూరమవుతూ మరింత దగ్గరవడం మాటి మాటికీ తొంగి చూసే మధురోహల మాలలల్లుకుని ఏమ్చేయ్యాలో తోచని వేళ పక్కన లేకపోవడం నరకంగానే అనిపిస్తుంది ఉదయాలూ మధ్యాన్నాలూ సాయంత్రాలూ ఇంటిచుట్టూ మూగిన పావురాళ్ళు గా బలవంతాన విసిరే శబ్ద గరిమల లోంచి అడుగు తీసి అడుగు వేసే యుగసంధి మధ్య పాక్కుంటూ రావడం ఎంత కష్టం మరి 3. తీరికలేని ఖాళీ జీవితాన్ని చివరి బొట్టు వరకూ ఒంపుకు తాగి మసకబారుతున్న సచేతనత నీడలో సేదదీరే౦దుకు క్షణం పాటు ఒరిగి స్థబ్దతలో కాస్సేపు ఒదుగుదామనుకు౦టానా పొట్టమీద పాకే ముని వేళ్ళ పలకరింపులు నిలువెల్లా పులకరింతల నదులై పూర్తిగా తడిపెస్తాయి తెప్పరిల్లిన ఊహలు కొత్త మొలకలై తలలెత్తుతాయి వద్దన్నపుడు కురిసే అల్లరి వానలా ఓ జల్లు చల్లగా ఏ మూల నుండో ఎదపై వాలుతుంది 4. ఇదీమీ కొత్తకాదుగా చూసే కళ్ళకు టేబుల్ పై మోచేతులాంచి పెనవేసుకున్న వేళ్ళపై తలనుంచి కళ్ళు మూసుకున్న పనిలేని తనమే కనిపిస్తుంది. ఓ ముగింపులేని నిరంతర కధనంలో నా పాత్ర అంతేనని ఎవరికీ తెలుసు?

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e469zG

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి