తిలక్/ఎక్కడ నీవు ---------------------------- ఏమని రాయను నిన్ను నా మనసులో పారబోశాక నిశ్శబ్ధాలను వర్ణించనా నిరీక్షణలను వల్లె వేయనా నీ మౌనంలో కరిగిపోయిన నా ఎదుచూపులు ఇక అలసిపోయి నీ జ్ఞాపకాల పొత్తిళ్ళలో నన్ను వెతుక్కుంటున్నాయి విధిలేక ఎన్నిసార్లు ఏరుకోను నీ మాటల ముత్యాలను ఈ హృదయ తీరంలో ఒక్కడినే నువ్వులేకుండా క్షణాలను యుగాలుగా మార్చడం యుగాలను క్షణాలుగా కరిగించడం నీకే తెలుసు నీ సహవాసంలో తడిసి ముద్దయిన ఈ దేహం నీ చిరునవ్వుల సంతకాలను చెరపలేకపోతోంది నువ్వెళ్ళిపోయినా నీ వాత్సల్యమే నిత్యం నా కళ్ళలో అనునిత్యం. తిలక్ బొమ్మరాజు 27.02.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dC4Kju
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dC4Kju
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి