పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, ఫిబ్రవరి 2014, గురువారం

Mani Vadlamani కవిత

కవిసంగమం మిత్రులకి, నా కవిత 'అక్షర హృదయం ' ఆంద్రప్రభ.కాం లో ప్రచురించబడింది (http://ift.tt/MwHFYn) అక్షర హృదయం అక్షరాన్ని! సృష్టి,స్తితి, లయ కారకమైన నాదాన్ని! ఓంకారాక్షరిని! అనాదిగా మేధో మధన ఆవిష్కృతని బహుముఖిని! వేదాక్షరిని! అమ్మతనం మెండుగా వున్న నిండు మాతృత్వపు మధురాక్షరిని! సాహితీ గుండెల హృదయ స్పందన శిల్పిని! రూపకల్పనాక్షరిని! వెన్నెలలో ఆడుకొనే జిగిబిగి పొంకపు అందమైన కవితా కన్నెల సౌందర్యాక్షరిని! అణగారే హీనుల, దీనుల పీడితుల కోసం పోరాటం సాగించే చైతన్యాక్షరిని! నిన్నమొన్న గతించిన గత వైభవ చిహ్నాలను లిఖించి ముద్రించిన సత్యాక్షరిని! కన్నీటిగాథల వెతలతో, ఆర్తుల ఆవేదన, ఆక్రోశం నిండిన రోదనాక్షరిని! అబద్దపు నీలి నీడల మాటున దాగిన కఠిన నిజాల వాస్తవ చిత్రాక్షరిని మరుభూమిలో సమాధుల మీద గాఢ నిద్రపోతున్న అమరాక్షరిని! సత్య, శివ, సుందర తత్వాన్ని నిలువెల్లా నింపుకొన్న ప్రణవాక్షరిని ఉషస్సు లోకి పయనమయ్యే కాంతిని! జ్ఞానాక్షరిని! అమృతాక్షరిని! ..................................... 26th Feb 2014 రచన : మణి వడ్లమాని

by Mani Vadlamani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MwHFYn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి