నగరం పైన Arasavilli Krishna వ్రాసిన ఒక అద్భుతమైన కవిత ...థాంక్స్ టు బాలసుధాకర్ మౌళి "తెలంగాణా / నీ కనురెప్పలపై వాలిన నగరాన్ని నీవే పురుడు పోసిన నగరాన్ని నిన్నూ దొంగిలించలేను విధ్వంసం చేయలేను" _____________________________________________ నాకై విరబూసిన మల్లెలు నా సొంతం కాదు ఆకాశం వైపు చూచి సాయంకాలానికి వాడిపోతాయ తెల్లవారుజామున రైలు దిగి యువ ప్రేమికుల ముందర కూర్చొని ఇరానీ చాయ్ తాగుతున్నప్పుడు గొంతులో దిగిన తేనీరు మాత్రమే నాది రోజంతా బాటసారిగా అణువణువు రహదారులను స్పృశించినా నా ఊరు నా కోసం ఎదురుచూస్తుంది అతిథిని మాత్రమే ఏ క్షణమయనా అతిథి పాత్ర ముగిసిపోతుంది నాది కాని దాన్నినాది అనలేను పరాయ మట్టి హృదయానికి అంటదు ఎక్కడినుంచో ఎగిరివచ్చిన కాకి అలసటతో పిట్టగోడపై సేదతీరవచ్చు మహానగర అన్నం మెతుకులకు ఆశపడవచ్చు అవి ఆకలి క్షణాలు. వొక నిర్మాణానికి చేతులు కావాలి ఆ శ్రమకు ప్రతిఫలం పొందాం వర్షం కురుస్తున్నప్పుడు ఎండ కాస్తున్నప్పుడు గొడుగు ఒక తోడు - వాతావరణం నిర్మలమయనప్పుడు గొడుగు గోడకు వేలాడుతుంది నగరం మనుషుల పందిరి పందిరి కింద నగరం ప్రవహిస్తుంది దాహమేస్తే ఒక్కోసారి నీరు అందదు నగరంలో నీటి ఊటలుండవు కడుపులో కాలుదూర్చి నిద్రిస్తున్న మనుషుల జాడ బహుళ అంతస్తుల విదేశీ కార్ల అజీర్తి నగరం మురికి కాల్వల బహిర్భూమిల అవసరాల మురికి వీధుల నగరం పాత కొత్త కట్టడాల శిథిలాల కింద నలిగిన శరీరాలు రక్తసిక్త రహదారిపై పడిన దిక్కులేని మృత శరీరాల వాసన ఎవరి నగరం వారిదే నగరానికి హృదయ గవాక్షముంది రక్త ప్రసరణ ఉంది తన బిడ్డలను పోల్చుకుంటుంది విశాలమైన వక్షస్థలంపై నగరం ఓ పీటముడి తెలుపు -నలుపు నగరం వర్ణ మబ్బులోని దృశ్యం నగరం బాలింతరాలి బాధ నగరం దేహపు ముఖం నగరం * నగరం ప్రియురాలు దొరికినంత అందినంత ఆస్వాదించాం ఎముకల గూడులా ఉన్నదో! పేలిన శబ్దాలకు నేలరాలిన పావురంలా ఉన్నదో! వెలిగించిన లాంతరులా ఉన్నదో! నగర దుఃఖ సమయాలన్నీ ఆనందాశ్రువులన్నీ నగరానివే. తెలంగాణా నీ కనురెప్పలపై వాలిన నగరాన్ని నీవే పురుడు పోసిన నగరాన్ని నిన్నూ దొంగిలించలేను విధ్వంసం చేయలేను వేరు చేయలేను నా సొంతం అనలేను నగరానికి ఎప్పుడూ అతిథిని మాత్రమే - ( * కృష్ణశాస్ర్తికి క్షమాపణలు) ఆంధ్ర భూమి - సాహితీ 24 ఫిబ్రవరి
by కోడూరి విజయకుమార్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hkzJFJ
Posted by Katta
by కోడూరి విజయకుమార్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hkzJFJ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి