పల్లె ఉత్సవం! మాయా మర్మం ఎరుగని మట్టి బిడ్డలు వానొస్తే ఆనందం సూర్యుడు ఉదయిస్తే సంతోషం కల్లా కపటం తెలీని అచ్చమైన గువ్వ పిట్టలు ఎల్లలు ఎరుగని భూమి పుత్రులు కాలం కాటు వేసినా గుండెల్లో మంటలు చెలరేగినా కన్నీళ్లు జారిపోతున్నా పల్లెజనం ఒక్కటై పోతారు తమ తరం మిగిల్చిన అనుభవాలను నెమరు వేసుకుంటారు! ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర ఊరు ఉప్పెనవుతుంది మరోసారి జాతరై అల్లుకుపోతుంది అదే పల్లెతనానికున్న గొప్పదనం మనుషులంతా పక్షులై పోయేది కులమతాలకు అతీతంగా జంగు సైరన్ లా సాగి పోయేది ఎప్పుడో తెల్లారి పోయే బతుకులు కావు వాళ్ళవి చివరి బంధాన్ని సైతం గుర్తు చేసే కాకులను ప్రేమించే అమ్మతనం వాళ్ళ స్వంతం ! వారం వారం జరిగే సంత వాళ్ళకో వేదిక ఏడాదికో సారి తిరునాళ్ళ జాతర వాళ్ళ బతుకులన్నీ ఏకమయ్యే ఏకునాదం మోత అది తోరణాలు పల్లవించే మట్టితనం వాళ్ళ కలివిడితనం అదే పల్లె బతుకుల ఆనంద తాండవం మరువలేని జ్ఞాపకం!!
by Bhaskar Palamuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mFHIhP
Posted by Katta
by Bhaskar Palamuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mFHIhP
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి