పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, ఫిబ్రవరి 2014, గురువారం

Nirmalarani Thota కవిత

చిన్నపుడు పండుగొస్తుందంటే చాలు . . ఒకటే ఎదురు చూపులు . . బడికి సెలవు కోసమో . . పిండి వంటల కోసమో . . . అదేంటో వయసొస్తున్న కొద్దీ అదో ప్రహసనంలా. . . ఏదో ప్రవళికలా . . జరుపుకోకపోతే పాపం తగులుతుందనో . . సమాజం వింతగా చూస్తుందనో . . అపార్టుమెంటు బాల్కనీలో చాకుపీసుతో ముగ్గు గెలికి . . నగిషీ ద్వారానికి నామోషీ కావొద్దని ప్లాస్టిక్ తోరణాలు కట్టి . . దేవుడి ముందు నూనె, వత్తి లేని కరెంటు దీపాలు పెట్టి స్వీట్ హౌస్ నుండి రెడీ మేడ్ ప్రసాదం తెచ్చి . . ఈగలో, దోమలో వస్తాయని . . . తలుపులు మూసుకొని హాస్టల్లో అబ్బాయికి ఓ సారి ఫోను చేసి అమెరికాలో అమ్మాయిని స్కైప్ లో చూసి హమ్మయ్య . . .పండుగ తంతు అయిందనిపించి . . ఛ . . ఛఛ . . ఇదేనా పండుగ ? ? ? పండుగంటే మనుషులు ఒక చోట కలవడం కదా. . .? కలిసిన మనుషులు మనసులు కలబోసుకోవడం కదా . . ? కష్ట సుఖాలు పంచుకోవడం కాదా. . .? సపరివార పంక్తి భోజనాలు కదా. . ? అమ్మలు కొసిరి కొసిరి వడ్డించడం కదా...? పెద్దలు మురిసి మురిసి చూసుకోవడం కదా...? క్యాలెండర్లో ఎర్ర మార్కేనా? అఫీసులొ పబ్లిక్ హాలిడేనేనా . . ? ఫోన్లలో ప్లాస్టిక్ నవ్వులేనా . . ? నెట్ లో మనసు నింపని చాట్ లేనా. . ? హు.. బ్రతుకు పండడం . . పండుగను బ్రతికించడం రెండూ గగన కుసుమాలైపొయాయే . . . . ! ! ( కవితలా లేదనుకోండి . . ఏదో నా వ్యధ . . పండుగల్ని కోల్పోతున్న బాధ . . ! ) నిర్మలారాణి తోట తేది: 27.02.2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o8GyKM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి