పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఫిబ్రవరి 2014, శనివారం

Sujatha Thimmana కవిత

ఆనందాణువునై .... శ్వాస తరంగాలతో జీవం నింపుకుంటూ.... రక్తమాంసాల ఆకారన్నిచ్చుకుంటూ.... ఎదిగానమ్మా...ఉమ్మనీటిలో ఈదులాడుతూ... మరణాన్ని సైతం లెక్కచేయక జన్మ నిచ్చావమ్మా...!! ఆడపిల్లనని అందరిలా అలుసు చేయక అక్కున చేర్చుకుని పెంచావే... నీ ఆశయాలకాయువుపట్టును నేనై... విషపు చూపుల తూటాలకు ఎదురు నిలిచి "ఆత్మాభిమానం " మా అమ్మగారిల్లని నిరూపిస్తానమ్మా !! నీ కంటి చివర నిలిచినా నీటి చుక్కలో... ఆనందాణువునై ....

by Sujatha Thimmana



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1egux66

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి