||ప్రసాద్ అట్లూరి || ప్రకృతి యాత్ర ..|| ("కౌముది" మాసపత్రిక లో వచ్చిన నా కవిత) నిశీధి భూతాన్నివెలుగురేఖల ఖడ్గంతో వధించిన వీరుడి విజయ చిద్విలాసం తూరుపు కనుమల పెదవుల్లో మెల్ల మెల్లగా విచ్చుకుంటూ తెల్లవారుతుండటం చూశాను నేలపై వేసిన ముగ్గుల చెట్లపైనుండి రెక్కలొచ్చి ఎగురుతున్న గొబ్బెమ్మల్లా ఆకాశ దారుల్లో పక్షుల గుంపులు డొక్కలకి ఆశల రెక్కల్ని కట్టుకుని బారులు తీరుతుండటం చూశాను ఉదయాన్నే మంచు బిందువులతో ముత్యాల స్నానం చేసిన ప్రకృతిమాత ప్రశాంత సంద్రపు విశాల దర్పణంలో తొలిసంధ్యా బింబాన్ని నుదిటిన సుతారంగా దిద్దుకుంటుండటం చూశాను కాలం చెల్లిన పండుటాకుల బంధాల్ని తెంపుకోలేక తల్లడిల్లుతున్న చెట్ల తల్లులు చిగురుటాకుల నూతనత్వపు అచ్చాదనలు తనువునెక్కడో తాకుతున్న పులకింతలకి తమని తాము వోదార్చుకోవటం చూశాను పైరగాలి పాటలకు పరవశించి నర్తిసూ ఝుంకార నాదామృతాల వెల్లువలో మైమరచి ఆడుతున్న కుసుమాలు బ్రమరాలకు తనువులు అప్పగించి మకరందాలను సమర్పించుకోవడం చూశాను తీరానికి ఆవల్నీ ఆక్రమించుకోవాలన్న బలీయమైన వాంఛ చిరకాలంగా తీరక అల్లకల్లోలమవుతున్న సముద్రుడు అలల పిల్లల్ని అస్తమానం ఉసిగొల్పుతూ దండయాత్రాల్నికొనసాగిస్తుండటం చూశాను భూమిలోని అలజడుల పొరల్ని గుట్టలు పోసుకున్న కొండలు పరిగెడుతున్న ప్రపంచ పోకడలకి నిలువెత్తు మౌనసాక్ష్యపు స్తూపాలై చేతలుడిగి వీక్షించడాన్ని చూశాను సాయంత్రపు సరదాలకి పరదాల్ని దించి ప్రియుడ్ని వదల్లేక వదులుతున్న ప్రియురాల్లా మలిసంధ్యని సాగనంపుతున్న అవని వివర్ణ విచార వదనాన్ని చీకటి చేతుల్తో కప్పుకొని బాధపడుతుండటం చూశాను రాత్రి గూటికి చేరీ చేరటంతోనే పాలపుం(ముం)తని కాలం కవ్వంతో చిలికి వెన్నముద్దల వెన్నెల్ని వెలికితీసిన జాబిలి భూలోకంలో పిల్లలకో ప్రేమికులకో పంచడానికి వినువీధుల్లో బయల్దేరి రావటం చూశాను రచించిన దృశ్య కావ్యపు రంగు కాగితాల్ని మనసు పొరల్లో ఓచోట భద్రంగా దాచుకొని ప్రకృతి యాత్రకు ఆనాటికి విరామాన్ని ప్రకటిస్తూ అలిసిన నా దేహన్ని ధరిత్రి వళ్ళోవాలుస్తోంటే కళ్ళు తృప్తిగా జోలపాడుకోవటం మొదలెట్టాయి ! >-బాణం->01FEB14 http://ift.tt/1aOyzly
by Prasad Atluri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1aOyzly
Posted by Katta
by Prasad Atluri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1aOyzly
Posted by Katta
లోతైనభావం
రిప్లయితొలగించండిఅనువైనపదజాలం
మనసంతా ఆక్రమించి
తాతాత్మ్యతననుభూతంచేసిన శైలి
అక్షరాలకందనిలాలిత్యవైవిధ్యం
అపురూపమైన కవిత
గాదిరాజు మధుసూదన రాజు