చంద్ర శేఖర్ వేములపల్లి || మది పరితపన || బృందావనం, నీ మనో ఉద్యానవనం .... ఎంతో దూరం లేదు. రావాలనుంది. విహరించి పరవశించేందుకు, నీ పక్కన, నీతో కలిసి నీ చెయ్యందుకుని .... నడవాలని. ఆ జ్ఞాపకం .... నాపరాయి మీద రాసుకుందామని, నా మది పొరల్లో, దాచుకుందామని .... నీ పేరును నా పేరుతో జత చేసి. అది మది, ఎదల సంతులనమేమో మరి! నీ ప్రపంచంలోకి రావాలనుంది. వస్తున్నా తళతళమని మెరిసే నీటి బిందువులా .... ఓ సౌందర్యమా! వస్తున్నా! నిండుగా, అంతర్లీనంగా ఆనందం తో ప్రకాశిస్తున్న ఆత్మ సౌందర్యమా! ఈ చల్లగాలి నా చెవిలో గుసగుసలాడుతుంది. ఏ ప్రమేయమూ లేకుండానే .... నాలో ఆహ్లాదం, ఎంతో ఉల్లాసం కలుగుతుంది. నీతో చెప్పాలని మనసు పరితపిస్తుంది ఈ ఆనందానికి, ఉల్లాసానికి కారణం నీవని మరి కాస్త దూరం .... నీతో ముందుకు నడిచి ఎక్కడైనా, ఏ మధుర జ్ఞాపకాల పరిమళాలనైనా గమనించగలమేమో అని .... వీలైతే, ఆ పక్కనున్న నాపరాయి మీద నా పేరును, ఆ మధుర స్మృతుల సాక్షినని నేనే అని రాసుకుందామని ఓ అద్భుత సౌందర్యమా! తళతళమని మెరుస్తున్న వజ్రం లా నీ ప్రపంచం లోకి రావాలనుంది. రావాలనుంది .... ఆకు ఆకు మీద, పువ్వు పువ్వు మీద తళతళమని మెరిసే మంచు నీటిబిందువునై నీ జగతి లోకి .... వర్షపు చిరు చినుకునై మనసున్న మనిషినై .... నీ జీవితం లోకి ఓ సౌందర్యమా! 2014, జనవరి 31 శుక్రవారం ఉదయం 10.30 గంటలు
by Chandrasekhar Vemulapally
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iiw7DB
Posted by Katta
by Chandrasekhar Vemulapally
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iiw7DB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి