కట్టా శ్రీనివాస్ || లోపటి ప్రపంచపు మాటలు ||కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ వ్యక్తి స్వభావాన్ని (mentality) అది అంతర్ముఖమైన (introvert) లేదు బహిర్ముఖులు (ఎక్ష్త్రొవెర్త్) విరుద్ధ ప్రవర్తనను, నిత్య జీవితం లో మనిషి తోటి మనిషి తో ఎలా మసలుకుంటారు. వ్యక్తి ని అర్థం చేసుకోకుండా తొందరగా ఒక నిర్ణయానికి రావడం ఇవన్ని కట్ట శ్రీనివాస్ గారి కవిత లో కనిపించే అంశాలు .. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా స్పురణ కు తెచ్చుకోవాలి (hipocrots) మనసు లో ఒకటి వుంచుకొని పైకి మరొకటి మాట్లాడటం ప్రవర్తించటం మనిషిజీవితానికి చెందిన అనేక రంగాల ప్రవర్తనా కోణాలను సున్నితంగా స్పృశిస్తుంది మానసిక శాస్త్రం. మొదటి పరిచయం లో నే వ్యక్తి ని అంచనా వెయ్యకూడదు అంటే నీకు కనిపించేది అంత నిజం కాకపోవచ్చుఇది చూడండి .. //సాధారణ విషయాలకు అతిగా నవ్వేవారిని చూసి, ఎంత బహిర్ముఖులో అనుకుంటాం //ఒంటరి ఆగాధాల లోతులు కనిపించకుండా కప్పేసేందుకు చేసే ప్రయత్నమే./// నిజమే పైకి కనిపించే ధీ నిజం కాకపోవచ్చు, మరి నిజం తెలుసుకోవాలి అంటే ...వారితో స్నేహం నేర్పిన తరువాత నే కదా తెలిసేది ...మనిషి ని అర్థం చేసుకోవడం లో వెనుకనే మే మనం ఎప్పుడు ... మానసికం గా దుఖాన్ని దాచి పెట్టి చాల మంది మన మద్యనే వుంటారు వారు చెప్పే దాక తెలియదు వారి వెనుక ఉన్న విషయము ఏమిటో ..కాని పైకి చిరునవ్వులు చిందిస్తు నలుగురి లో కలివిడి గా తిరుగుతారు కింది పంక్తులలో జాగ్రత్త గా గమనిస్తే ...మనషి పైకి కనిపించని మరో కోణాన్ని చూడాల్సిన అవసరం వుందని అనిపించింది రాత్రి పగలు పడుకునేవాడిని సోమరి బద్దకస్తుడు అనటమే కాని అలా ఉండటానికి గల పరిస్థుతులను ఎవరు అయిన గమించార, మాటలు ను సూటిగా చెప్పేవారిని ఫ్రాంక్ పర్సన్ అంటాము తప్ప, నిజంగా అసలు విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని గ్రహించగలామ నిర్విచారంగా జీవితాన్ని గడిపేస్తున్నారో అనుకుంటామే కానీ,//వారి గుండెల నిండుగా విచారం గూడుకట్టుకున్నదన్న //ముక్కుసూటి మనిషనుకుని మురిసిపోతాం రహస్యాల కవాటాలను విప్పారకుండా దాచేసే ప్రయత్నమనే వాసన....// పిరికితనం, ఏడుపు (crying), dareness (ధైర్యం) మూడు మానసికము గా కలిగే భావోద్వేగాలే. ఒక్క మనిషి లో మాత్రమే చూడగలిగే భావన ఏది అంటే నవ్వు ఏడుపు ...చాల మంది అంటూ వుంటారు మాకు ఏడుపు రాదూ ...మేము మానసికం గా బాగా దృడం గా ఉంటాము అని, కాని నిజంగా గుండె లోతుల్లోకి వెళ్లి చూస్తే ఆకాశం బద్దలయ్యే దుక్ఖాన్ని దాచిపేట్టుకుంటారు ఏడుపే రాదనే వారిని చూసి వారికెంత గుండె నిబ్బరమో! // వారెంత బలహీనులో గుండె తలుపులను తట్టగలవారుంటేనే// ఏడిచే వారినీ లోకం వేరే గా చూస్తున్నదా కాని చాల మంది చిన్న విషయాలకి కన్నీరు పెడతారు బలహీనులని గేలి చేసి సంతోష పడతాము తప్ప వారు నిజంగా ఎంత సున్నితం గా ఆలోచిస్తారో కదా...ఇలాగ ఎప్పుడైనా ఆలోచించామా ?? //చిన్న చిన్న విషయాలకే కంటతడి పెట్టేవారి కన్నీటీ బిందువులు //మొత్తని హృదయ స్పందనేసుమా అని మాట్లాడుతుంది. కోపాన్ని ప్రదర్శించే వారు ఎప్పుడు అభద్రతా భావం తో నో లేదంటే, ప్రేమ రాహిత్యం తో ను కొట్టుమిట్టాడుతూ వుంటారు మీ మీద కోపం చూపిస్తే దూరం వెళ్ళాసిన అవసరం లేదు వారి కళ్ళలో కన్పించే దయనీయ భావాన్ని చదవాలి అంటారు వ్యక్తి అతిగా కోపిస్తున్నారంటే,//అహంకార ప్రదర్శనమో నని అసహ్యించుకోవలసిన పనిలేదు.//భాష్యం కళ్ళ వెనక తడినడిగితే చెబుతుంది. కవిత ముగింపు చాలా హత్తుకుంటుంది తెలిసిన నిజాన్నే మరోసారి గుర్తు చేసారు, మనిషి ని చదవాలంటే ప్రంపంచం లో అన్ని భాషలను ప్రయత్నిచినా "మనసు " భాష తెలుసుకొని మసలు కొంటె బాగుటుంది అంతే కదా.., మనిషి ని అర్థం చేసుకోవాలి అంటే మనసు లోతుల్లో కి వెళ్ళగలగాలి, గుండె లో ని ప్రేమ ని చూడగలగాలి, స్నేహాన్ని అందుకోవాలి అన్నప్పుడు పరిగెట్టటం కాదు ...నిలబడి ఆసాంతం మనిషి ని ఆకళింపు చేసుకుంటేనే సాద్యపడుతుంది నేస్తం !!!!.. మనుషులర్దం కావాలంటే బాహ్య ప్రపంచపు భాషలన్నీ వస్తేనే చాలదు.//మార్మిక లోతులనోసారి తిరిగి తిరిగి రావాలి.//గుండెల లోపలికి కొంచెం ప్రేమను వొంపుకోవాలి,పరిగెడితేనే తీరం చేరలేవు నేస్తం, ===== కట్టా శ్రీనివాస్ || లోపటి ప్రపంచపు మాటలు || మన మెందుకో అవతలి వారిని త్వరగా అపార్ధం చేసుకుంటాం కానీ లోతుల్లోకి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అతి సాధారణ విషయాలకు అతిగా నవ్వేవారిని చూసి, ఎంత బహిర్ముఖులో అనుకుంటాం కానీ, ఒంటరి ఆగాధాల లోతులు కనిపించకుండా కప్పేసేందుకు చేసే ప్రయత్నమే అదని గమనించం. పగలూ రాత్రీ తేడా లేకుండా నిద్రాదేవత ఒడిలో ఊయల లూగుతున్నవారిని చూసి ఎంత నిర్విచారంగా జీవితాన్ని గడిపేస్తున్నారో అనుకుంటామే కానీ, వారి గుండెల నిండుగా విచారం గూడుకట్టుకున్నదన్న విషయాన్ని గమనించలేం. తక్కువ మాటలను, ఎక్కువ వేగంతో చెప్పేస్తే ముక్కుసూటి మనిషనుకుని మురిసిపోతాం కానీ, రహస్యాల కవాటాలను విప్పారకుండా దాచేసే ప్రయత్నమనే వాసన పట్టుకోలేం కాక పట్టుకోం. నాకసలు ఏడుపే రాదనే వారిని చూసి వారికెంత గుండె నిబ్బరమో! అని ధైర్యానికి ప్రతిరూపంగా భావిస్తాం. కానీ వారెంత బలహీనులో గుండె తలుపులను తట్టగలవారుంటేనే తెలుస్తుంది. చిన్న చిన్న విషయాలకే కంటతడి పెట్టేవారి కన్నీటీ బిందువులు ఓ సారి కదిలిస్తే అది జిత్తులమారితనం కాదు అమాయతను రంగరించుకున్న మొత్తని హృదయ స్పందనేసుమా అని మాట్లాడుతుంది. ఆటలో అరటిపండ్లలాంటి తొక్కలో విషయాలకో వ్యక్తి అతిగా కోపిస్తున్నారంటే, అది ఆధిపత్య ప్రదర్శనో, మితిమీరిన అహంకార ప్రదర్శనమో నని అసహ్యించుకోవలసిన పనిలేదు. వారు ప్రేమరాహిత్యపు దాహంతో కొట్టుమిట్టాడుతున్నారనే భాష్యం కళ్ళ వెనక తడినడిగితే చెబుతుంది. మనుషులర్దం కావాలంటే బాహ్య ప్రపంచపు భాషలన్నీ వస్తేనే చాలదు. లోపటి లోకాల ఊసులు తెలియాలి, మార్మిక లోతులనోసారి తిరిగి తిరిగి రావాలి. గుండెల లోపలికి కొంచెం ప్రేమను వొంపుకోవాలి, చాపే చేతులతో హృదయాలను అందుకోవాలి. పరిగెడితేనే తీరం చేరలేవు నేస్తం, ఓ సారీ నిలబడి భారం బేరీజు వేయగలగాలి.
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jxIhJv
Posted by Katta
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jxIhJv
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి