నరేష్కుమార్//ఓ ప్రయాణాంతర ప్రేలాపన// 0) డార్విన్ సిద్దాంతంలా మనమూ మారిపోతూంటాం నేను-మేమూ-మనమూలుగా,మామూలుగా ముడుతపడ్డ కాలాన్ని కాస్త ఇస్త్రీ చేస్కుంటాం మనిషిగా తప్పిపొయిన మనలని వెతుక్కుంటూ మనుషుల మధ్యే తిరుగుతుంటాం.. రాహోన్ మే చల్తీరహే సఫర్ హమారా ఇన్సాన్ బన్ కే, సారీ దునియాకా మెహమాన్ బన్ కే... 1) కొన్ని ప్రయాణాలు. కేవలం ప్రయాణాలనలేం చరించే చరణం, చలించే దేహం ఘలించే గళం స్మరించే పదం నర్తించే పాదం అన్నీ.. నిజానికివన్నీ నిజం కావేమో 2) ఎప్పుడంటావ్ ఇదివరలో మనిషిగా కాక సమూహంగా నేనుగా కాక. మనంగా బతుకుగ్గా కాక జీవితంగా నువ్వు కదిలిన క్షణం అదే ఆ క్షణం గతం లో ఎక్కడో వెలుగుతూనే ఉంది కదూ... 3) వినిపించే రాగమై ఒకరు, కనిపించే అను రాగమై ఇంకొకరు మనసు దారుళ్ళో కొన్ని పాదపు ముద్రల్ని ముద్రించినడుచుకుంటూ పొయాక... మిత్రమా...! అనగలవా ఇప్పుడు నేనూ అనేది కేవలం ఏకవచన సూచనాపదం మాత్రమే అని... 4) నిశ్శబ్దపు రాతిరి రాగాల రంగులద్దుకొని కొన్ని నవ్వులు కలిపిన పాటలై పక్షుల్లా రెక్కలల్లాడించి నిర్థాక్షిన్యంగా దుఖాలూ,ఆందొళనలూ అన్నీ అన్నీ చచ్చిపడిన చిత్రాన్ని మొహాన అతికించుకొని. ఓ మోడెర్న్ ఆర్ట్ లా మారిపోయాక ఒహ్హూ..!. పికాసో మళ్ళీ రావోయ్ ఈసారి అందమైన గొయెర్నికాని చిత్రించ గలవేమో ప్రయత్నించూ... 5) గోదావరిలో... నీళ్ళే నా కేవలం నీళ్ళేనా ఉన్నది..! కొన్ని ఆనందాశ్రువులూ రాలిపడ్డాయ్ రెండ్రోజుల కింద . అప్పుడప్పుడూ ఉప్పెనవ్వటమే తెలిసిన గోదారి మా ఆనంద భాష్పాలతో కలిసి ఇవాళ కాస్త ఉప్పనైంది.... 26/02/14
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OChXUf
Posted by Katta
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OChXUf
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి