పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఫిబ్రవరి 2014, బుధవారం

Thilak Bommaraju కవిత

తిలక్!!అ/నిర్మితం!! --------------------­-------- నువ్వెప్పుడైనా కలలు కూలిపోవడం చూసావా? చెట్లు ఆకులను,పువ్వులను కలగంటాయి తమలోనే దాచుకోవాలని కాని శిశిరపు కాటిన్యంతో వసంతపు శకలాలను పోగుట్టుకుంటాయి నువ్వు కూడా కొన్నిసార్లు స్నేహం ప్రేమ కామం కాంక్ష స్వార్థాలను పోగేసుకోడానికి ఆర్తిగా యత్నిస్తావు అనిర్మితమైన అంచులపైన నిలబడి కొన్ని వాన చినుకుల మధ్య నీ దేహం స్వచ్చమైన ప్రకృతితో రమిస్తుంటుంది ఆవేశపు కణాలను కక్కేస్తూ నిన్ను నువ్వు కడిగేస్తూ అలసిన ఆత్మల పరివర్తనలో కళేభరాల బూడిదను ఎత్తుకుంటూ తిరుగాడుతుంటావు నిశీధిలో విగత ఎడారిలా... మళ్ళీ ఇప్పుడు కొన్ని కలలను కనాలి నీకు నువ్వుగా బ్రతకడానికి.... తిలక్ బొమ్మరాజు 23.02.14 26.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evzMcz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి