యాకూబ్ | అదెట్లున్నా...!? ................................. నేన్నిన్ను ఇలా చూడలేనమ్మా నువ్వెవరో తెలియని వీధుల్లోకి పంపి ; పలకరింపు ఒక్కటైనా లేని దారుల్లోకి తోలి కొన్ని గదుల్ని, కొన్ని ఫ్యాన్లని ,ఆన్ చేసిన వో టి.వి.ని నీకప్పగించి అన్నీ అమర్చాను కదా అని సంతృప్తి పడిపోతూ మా పనుల్లోకి మేం జారుకుంటూ 'నేనేమిట్రా' అన్నట్లు చూసే నీ చూపుల్ని తప్పించుకుంటూ తిరుగుతూ విరుగుతూ నేన్నిన్ను ఇలా చూడలేనమ్మా ఊళ్ళో నీ అరుపులు , బండెడు చాకిరీ ,తన్నులుగుద్దులు . నిజంగా నువ్వు బతికిందీ , ఇంకా బతుకుతున్నదీ అక్కడే . కష్టాల్లోనే జీవితముంది- అదెట్లున్నా ?! సుఖమా - అదొట్టి ఖాళీ తిత్తి . అక్కడేం లేదు.ప్చ్.డొల్ల . ఊసుకున్నా ఉమ్ముకున్నా నీ ఇంట్లో ఇదేందని అడిగినోల్లు లేరు. లేచినా పండుకున్నా ఆరాంగా, హాయిగా . లోకమంతా నీడైనట్లు,నీదైనట్లు ; నీవే లోకమైనట్లు బతికినవ్ చూడు ; అదే జీవితం. ఇదేంది : ఇక్కడ అన్నీ బోల్టులు ,నట్లూ బిగించిన గిర్రలాగా . నోటికడ్డంబెట్టి ఆపుకునే తుమ్ములాగా . అదుముకుని ఆపుకుని కొంచెం కొంచెం కొసరి కొసరి బతకడం. దీనబ్బా ! ఇట్లుంటదా జీవితమంటే. అమ్మా : నువ్వే కరెక్టు. " ఎంత దుప్పటి ఉందో అంతే కాళ్ళు జాపాలి " ఈ బతుకుల్నేమో దుప్పటి, కాళ్ళూ అసలు సమజతైనే లేదు. 26.2.2014
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OBTQFo
Posted by Katta
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OBTQFo
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి