తొవ్వ ............అన్నవరం దేవేందర్ నేల నేలంతా పరిడవిల్లుతున్న కాలం అవును ఇప్పుడు తెలంగాణా నేలంతా పరిడవిల్లుతంది.సంబురాలు చేసికుంటంది సై సై అని ఎగురుతంది .తల్లి పీరి పట్టుకొని ఆగవట్ట వశం లేని ఎగురుడు ఎగురుతంది .నిజానికి ఇప్పుడేమన్నా విప్లవించిందా,విముక్తి అయ్యిందా ? పటం మీద కొత్త గీతలు పడ్డయి.అయితే దేశం లో ఇదివరకు అమలు అవుతున్న దోపిడీ ఆగుతదా పీడన ఆగుతదా సామ్రాజ్యవాద పెత్తనాలు ఆగుతాయా ..సామ్రాజ్యవాదుల బంటులైన వారి నిలువు దోపిడీ ఆగుతది.వాళ్ళ పీడన ఆగుతది .అదే సంబురం . ఎందుకంటే తెలంగాణా చాలా ఏళ్లుగా పరాయికరణ చెందింది .డెబ్బై ఏళ్ళకు పైగా పోరాటం చేస్తంది .అయితే రాజ్యాంగ బద్దం గా జరిగిన ఇదొక్కటే సక్సెస్ అయ్యింది .విజయాన్ని ముద్దాడింది .నలబయో దశకం ల తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ,అరవయో దశకం ల తెలంగాణా పోరాటం ,ఎనబయో దశకం లో నక్సలైట్ పోరాటం అవన్నీ విజయానికి చేరువ మాత్రమే అయినవి .ఆ పోరాటాల ప్రభావాలు సమాజం మీద పడవచ్చు కాని లక్ష్యం సాదించలేదు .ఈ ఇన్ని పోరాటాల ఫోర్స్ తోనే తొంబై ఆరు నుంచి రెండువేల ఒక్కటి నుంచి తెలంగాణా ఉద్యమం వచ్చింది .ఇది సాదించింది .చాలా ఏళ్ల తరువాత ఈ విజయం అందుకే ఈ ఎగురుడు దునుకుడు . పాత చరిత్ర చర్వితం ఎందుకు కాని తెలంగాణా ,ఆంధ్ర రెండు అసమ సమాజాలు కలయికే కుట్ర ,మోసం తో కూడుకున్నది .ఇంకేముంది మొత్తం తెలంగాణ ను దోచుకున్నారు .అనుమానం లేదు నిజమే నిధులు ,నీళ్ళు కొలువులు అన్నీ ,పాలన చేత పట్టిండ్రు ,సినిమాలు పత్రికలు ,ప్రసార మాధ్యమాలు సకల రంగాల్లో సొచ్చిండ్రు .అయితే రెండు ప్రాంతాల బేధ భావం లేకుండా వుంటే వివక్ష లేకుండా వుంటే అంతా సమానం వుంటుడే.కాని రెండో శ్రేణి గా చూడడం లోనే కొనసాగింది .ఇది అన్ని రంగాలలో రాజకీయం ,పార్టీలు సంగాలు సంస్థలు ,విద్య ,వైద్యం ,చరిత్ర ,సంస్కృతి ఒక్కటేమిటి అన్యాయం జరగని రంగం లేదు . దీంతో తెలంగాణ సమాజం కు మంట పుట్టింది .ఆ మంట పలించించింది. ఒక భాద కాదు ఇది ఇప్పుడు సల సల సలిపే గడ్డ పలిగి చీము అంతా ఎల్లి పోయినంత హాయి అని సేద తీరుతున్నారు వ్యాపరులైన రాజకీయనాయకులు తప్పితే దోపిడీ పీడన ను ఎవరు కాని ఆమోదిస్తారు .పీడన దోపిడీ ఎక్కడున్నా ఈ రూపం లో ఉన్న ఎదిరించుడే .అది రేపటి తెలంగాణా లోను ఉండొచ్చు సీమాన్ద్రలోను ఉన్డొచ్చు . నేల నేలంతా పరిడవిల్లుతున్న కాలం పెయ్యి పులకరించే మట్టి స్పర్శ తెలంగాణం మహా తెలంగానం సకల ఆధిపత్యాల పై పూరి విప్పిన రేశం పీడన పై ఎదురేగిన ఊరేగింపు తెలంగాణ..నవ నవలాడే తెలంగాణ..
by Annavaram Devender
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cNK0bN
Posted by Katta
by Annavaram Devender
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cNK0bN
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి