బడుగు భాస్కర్ జోగేష్ | హంటర్ రోడ్‌లో ఒంటరిగా… చీకటి కాటుక పూసిన నింగి నేత్రపు నిరంతరాయ నిరీక్షణ నడిరేయి నల్లని రహదారిపై నల్లగ మెరిసే మాయాముద్రలు నిదరోయే నల్లతుమ్మ చెట్టు చెంతకు చేరి నిను మరి మరి మేల్కొల్పుకునే నీ నేను గగనం శిరసును మెరిసే తారకల తన్మయ కాంతుల్లో అలనాటి నీ అడుగుల సవ్వడికై ఆరాధనాధారిత అన్వేషణలు నీవు నడిచిన మార్గాన నిలిచి నిను తలపోస్తోన్న సమయాలు నీవెన్నెడో పయనించి పరిచిన నీ మృదు పాద ముద్రలు ప్రోదిచేసుకు పొదువు కోవాలన్న ఆరాట ఆరోహణా గరిష్టతలు నీవు నడయాడిన నడకలపై నా కనుల కాళ్లెంత కలియ తిరిగినా కానరావు తెగిపడే మానస తంత్రుల అనుదిన విలాప శృతులు నీకెన్నటికీ వినిపించవు నా హృదయాంతరంగములో విస్తరిస్తోన్న రహదారిలోకి నీవెన్నటికీ రాలేవు నీకై వాడిపోని కాలాతీత వీక్షణతో నీవొదిలి వెళ్లిన దారి దరిన నీ దరి చేరలేని నేను ఒంటరిగా. . . ఒంటరిగా. . . 10-02-2014 http://ift.tt/1ekrdAV
by Meher
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ekrdAV
Posted by Katta
by Meher
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ekrdAV
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి