తెలంగాణా ఏర్పాటు కోసం పార్లమెంటు లో పెట్టనున్న బిల్లు లో పోలవరం కు సంబంధించి తీసుకున్న నిర్ణయం ఆదివాసీల పాలిట శాపంగా మారనుంది. అందుకు విరసం ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహిస్తోంది .ఆ సందర్భంగా .. పోలవరం పోరుదారి||డా// కాసుల లింగా రెడ్డి || 11-02-20214 పల్లవి: కడుపుచేత పట్టుకోని మూటముల్లె సర్దుకోని ఏదారి నేను పోదునో మాయమ్మలార బతుకు- గోదారి పాలాయెనో మాయన్నలార చరణం1: చెట్టుగొట్టి మొట్టుదీసి- కంపగొట్టి కాలవెట్టి కండగరగ ఎముకలరగ- రక్తమోడ్చి చెమటదీసి పోడుగొట్టి సాగుచేస్తిమో మాయమ్మలార బతుకుపంట పోగుచేస్తిమో మాయన్నలార చరణం2: తాతతండ్రుల సాలువట్టి-ఊరువాడ దోస్తిగట్టి కష్టసుఖం పంచుకోని-కలిఅంబలి కలిసితాగి కాలమెల్లదీయవడ్తిమో మాయమ్మలార అడవితల్లి ఆదరించెనా మాయన్నలార చరణం3: ఉరుములేని పిడుగులాగ-పగబట్టిన పాములాగ భూమిజాగవదలాలని- పోలవరం కడతామని మా మెడలమీద కత్తివెట్టిరా మాయమ్మలార జలయజ్ఞం పేరుచెప్పిరా మాయన్నలార చరణం4: ఇరుగబూసిన వెన్నెల్లో- రేల ఆటపాటల్లో పాపికొండల పాయల్లో- గోదావరి పరుగుల్లో గంతులేసె జింకలతో- నెమలి కూత ఆటలతో అడవితల్లి అందాలు- ఆదివాసి బంధాలు బతుకుబాట పాపవట్టిరా మాయమ్మలార పేగుబంధం తెంచవట్టిరా మా యన్నలార చరణం5: ఆశచచ్చినోడెవ్వడు- చేవలేని వాడెవ్వడు మధ్యయుగం నీతులను- ఏలే బలవంతులను తరిమి తరిమికొట్టుదామురో మాయమ్మలార యద్ధం మొదలెట్టుదామురో మాయన్నలార చరణం6: ఆశయాల వెలుగులల్ల- మన అమరుల దారులల్ల చేయిచేయి పట్టుకోని- బడితకట్టెలందుకోని పోరుబాట నడుద్దామురో మాయమ్మలార పోలవరంనాపుదామురో మాయన్నలార 'నమస్తె తెలంగాణ' దినపత్రికలో 16 నవంబర్ 2011
by Lingareddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1el07JZ
Posted by Katta
by Lingareddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1el07JZ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి