పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, మే 2014, గురువారం

Thilak Bommaraju కవిత

తిలక్/నీటి స్పటికం _______________________ చెమ్మ ఇంకిన కిరణాలు పొద్దూకులా ఇంటి ముందు పడుంటాయి వాటినెవరో ఇక్కడ పారబోసినట్టు పచ్చి గుర్తులు కిటికీలోంచి నా కళ్ళు వాటిని ప్రతిరోజూ కడుగుతుంటాయి మబ్బుపట్టకుండా అవి తడుస్తూనో నన్ను తడుపుతూనో ఉంటాయి రాత్రి మిగిలిన సగం విరిగిన కలలా నన్ను నడిపించే కాళ్ళలా నాతోనే ఇప్పుడు కొన్ని ఆకులు మళ్ళా రాలాలి వాటి కోసం పనిమాలా పిట్టగోడపై చెకోరపక్షిలా ఎటు ఎగరాలో తెలియని క్షణం కొంత ఎర్రమట్టిని అరచేతుల్లో పొదువుకొని ఆకాశపు మొదళ్ళలో అంటుకడుతుండే ఆనవాళ్ళు భూమిపై కూర్చున్న సముద్రమొకటి లేచి వెళ్ళినప్పుడు అవే చేతులు కొత్త ప్రతిబింబంలా హత్తుకుంటాను కనిపించని అస్పష్టతను వెంటతెచ్చుకొనే మొసళ్ళు ఈ బంధాలు గాలివేర్లలా తిలక్ బొమ్మరాజు ......29/05/14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivFxty

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి