పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, ఏప్రిల్ 2014, గురువారం

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు ( అనుదిన వ్యాయామం ) నేను ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో వాకింగ్ చేస్తుంటా, ఒంటికి నలుపు రంగు పూసుకొన్న తెల్ల కోకిల “కూ”, “కూ” అంటూ వెన్నెల రాగాలు తీస్తున్నది... ఒంటి నిండా తెల్ల బొచ్చు అంటించుకున్న నల్ల కుక్క “కవ్”, “కవ్” అంటూ చీకటి గోల చేస్తున్నది... నేను ఆధునిక సౌకర్యాల హాలులో ప్రాణాయామం చేస్తుంటా, రోగాల గొడ్డళ్ళకు, ఇంగ్లీషు మందుల కత్తులకు బలైన పొలం తూలిపడటం, తట్టుకొని నిలబడటం అభ్యసిస్తున్నది... ముడతలు పడిన చర్మ ఖర్జూరం ఒలిచేసుకొని మనిషితనం కొత్త రూపాయల కుర్ర చర్మం తొడుక్కొని కులుకుతున్నది... నేను మా ముసినిపల్ పార్కులో మునుల్ని, ఋషుల్ని పిడికిళ్ళలో పెట్టుకొని కొత్త ధ్యానం చేస్తుంటా, పక్క అపార్టుమెంటులో ఆడుకుంటున్న పిల్లకాయలు సూర్యభవనాలకు, చంద్ర నక్షత్రాల వీధులకు కొత్త విద్యుత్తు అందిస్తున్నారు... బయటకు కదలొద్దని మనుషులు శాసించిన దేవుళ్ళు నిగ్రహాల విగ్రహాలలో పగలైనా నిద్రపోతూనే ఉన్నారు... ఇక నేనిప్పుడు సూర్యు డిచ్చిన రెక్కల్ని తొడుక్కొని గరుడ గమనంతో అవకాశ ఆకాశంలోకి బయలుదేరాను, సోదరులారా, రస హృదయ భావుకులారా, నన్ను ఉచితాసనంగానో, పదునైన ఆయుధంగానో చేసుకోండి, కదలకుండా చచ్చిపోతారో, కదులుతూ కంపల్ని నరుక్కుంటారో మీరే తేల్చుకోండి. 24-04-2014

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f8zUpb

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి