విజయ్ కుమార్ ఎస్వీకె రాసిన కవిత !!ఖాళీ భూమి!!//కవిత్వ విశ్లేషణ// _______పుష్యమి సాగర్. ప్రపంచం కుగ్రామం అంటాము కదా మరి ఇంత పెద్ద విశాల భూమి లో చుట్టూ మనుషులు ఉన్న కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఉన్నప్పుడు !మనిషి ! సామాజిక జీవి అన్న దానికి అర్థం లేకుండా పోతుంది ఏమో...!!! S.v.k గారు తీసుకున్న వస్తువు కూడా మనిషి కి మనిషి కి పెరిగి పోయిన దూరాన్ని కొలిచే ప్రయత్నం చేసారు లా ఉన్నదీ ...ఓ చోట ఇలా అంటారు ...!!! ఒంటరి //యెవరికివారు; //గింజలు బుక్కు //సమయమే //ఉమ్మడి జాగ్రత్త గా గమనించండి ...ఆధునిక నాగరికత అని మనం మురిసిపోతున్నాం మనుషులు కలిసారు కాని, మనసు లు కలిసాయా ???? ఒకే కుటుంబం లో ఉన్న కూడా ఎవరికి వారే ...బువ్వ తినే ఆ రెండు క్షణాలు తప్ప , మనం ఎపుడైనా కలుసుకున్నామా !! మనిషి ని ముఖ్యం గా రెండు విషయాలు బాధిస్తాయి ....ఘటన జరిగినపుడు పుట్టిన వేదన .....మరి గడిచిన గతాన్ని తవ్వుకుంటూ కన్నీళ్లను కార్చినపుడు, నిజంగా మన చేతుల్లో గతాన్ని చెరిపి వెయ్యగల పరికరం ఏమన్నా ఉంటె బాగుండు కదా.... "కొన్ని తవ్వకాల అనంతరం //వెలువడు //జ్ఞాపకం పై పడు కన్నీరు బిందువులు-" ఇప్పుడున్న ప్రపంచం లో సర్వం స్వార్థం అయినపుడు, సమూహాలకు సమాధి కట్టేశారు ..... కేవలం ఇక్కడ మనిషి కి మరో మనిషి కి బందం ఏమన్నా ఉంది అంటే కేవలం పరిచయమే.... //మనిషి మనిషీ పరిచయం అంతే యిప్పుడు-// యెవరివ్వారివే మూకుమ్మడి //సంతలో //బేరాలు- పై వాక్యం లో చూడండి ...మనిషి తన కు కావలసిన వ్యక్తిగత అవసరం చూసుకుంటున్నాడు తప్ప పక్కనోడి గురించి పట్టించుకోవటం లేదు ఎవరికి వారె ...సంత లో ...బేరాలు లాగానే ...!!! మరి ముందుగా చెప్పుకునట్టు గా మనుషులలో పెరిగిపోయన స్వార్ధం వలన ఎవరి ప్రయోజనం వారే చూసుకోవాలి , ఈ కవి నిజంగా ప్రపంచం లో నిజమైన నికార్సనైన మనుషుల కోసం ..మనుసుల కోసం వెతుకుతున్నాడు ...మార్మికత పూర్తిగా నిండిన ఈ రచన లో కొన్ని బావ చిత్రాలను మనమే ఉహించుకొని ఆకళింపు చేసుకుంటే కవి చెప్పదలచుకున్న భావం చక్కగా అవగతం అవుతుంది ...మనుషుల్లో పెరిగిపోతున్న ఏకాంత , ఒంటరి సమూహాలను తరమి కొట్టి ..మనుషులు గా మసిలే రోజు కోసం ఎదురు చూడటం బాగుంది ... కవిత ను ఇంకాస్త సరళం గా రాసి ఉంటె పాఠకుడు ఏ స్థాయి వాడు అయిన త్వరగా ఆకళింపు చేసుకొనుటకు వీలు గా ఉంటుంది ..SVK గారు మంచి expression ఉన్న రచన ను అందించారు..కాస్త సమాజ పరంగా కూడా వారి కలాన్ని మరలించితే బాగుంటుంది ...ధన్యవాదాలు ... సెలవు .. •• ఖాళీ భూమి •• దేహంపై పురాతన మనిషి పచ్చబొట్టు- కాలంపై సందేహం మరక గుర్తు- ••• కొన్ని తవ్వకాల అనంతరం వెలువడు జ్ఞాపకం పై పడు కన్నీరు బిందువులు- కోల్పోవుతనం శ్వాస- "చట్లు సమస్తం నరకబడు కల బాధ చేయదు-" ఒంటరి యెవరికివారు; గింజలు బుక్కు సమయమే ఉమ్మడి చర్య- మాయలు చేయు యుగం సమాధి- మనిషి మనిషీ పరిచయం అంతే యిప్పుడు- ••• యెవరివ్వారివే మూకుమ్మడి సంతలో బేరాలు- 05/21/2014
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gj3Dfy
Posted by Katta
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gj3Dfy
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి