పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, మే 2014, మంగళవారం

Pusyami Sagar కవిత

పనసకర్ల ప్రకాష్ గారు రాసిన కవిత !!చావు తరువాత !!//కవిత్వ విశ్లేషణ// _______పుష్యమి సాగర్. చావు అంటే శరీరంలోనుంచి జీవుడు పైకి పోవుట అని అర్ధం చెప్పబడింది ...పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది చావు లేదా మరణం (Death). తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. దీనిని సంస్కృతంలో మృతి లేదా మృత్యువు అని అంటారు.. మృత్యువు గురించి తాత్వికంగా చెప్పటం అంటే కొంచం కష్టమే...చావు తర్వాత కవిత లో కొన్ని నిజాలు ను చెప్పి జ్ఞాన భోధ కలిగించేలా మనసు ను తాకుతాయి ...నిజంగా చావు అంటే ప్రతి వారికి ఎందుకు భయం కలగాలి , చావు అంటే ఉదయం నుంచి సాయంత్ర్హం వరకు ఆడుకునే ఒక ఆట లాంటిది కదా....నిజమే జీవితం లో ఎవరు గుర్తు చేసుకోరు వచ్చే చావు కోసం... చావంటే ఏంటి ...? పురాతనకాలం నుంచి చెప్తారు మరణం మనిషికే కాని ఆత్మ కి కాదు ...ఇది ఒక దేహం నుంచి మరో దేహానికి విడిచి వెళ్ళే వాహకమే ..ఒకే ఒక వాక్యం లో చక్కగా చెప్పారు ... !! చావ౦టే ఏ౦టి..?//రూపాన్ని మార్చుకోడమేకదా..! నీడలా వెంట వచ్చి తీసుకు పోయేది చావే కదా ...మరి దానితో దోబూచులాట ఎందుకు ..ఇక్కడ చావు ను ఒక ఆట తో పోల్చడం బాగుంది ..పుట్టుక నుంచి చావు ..రోజు లో ఉదయం నుంచి సాయం వరకు ఆడే ఆట లాంటిదే మరి నీడై వె౦బడి౦చే చావుతో ఎన్నాళ్ళు//నీ దోబూచులు.../రాత్రైతే ఆట ముగిసిపోవాల్సి౦దే సహజ మరణం రావాలని అది కూడా సౌఖ్యం గా ఉండాలని కోరుకుంటారు ...కాని ఇక్కడ మన చావు కి మనమే దారులు వేస్తున్నాము ...చెడు అలవాట్ల తో .చెడు ఆలోచనలతో ..నిజమే మరి మన శరీరాఇనికి హానికరం అపాయకరమైన అలవాట్ల తో నే సగం చస్తున్నాం ... మన గోతుల్ని మన౦ ఎప్పుడో తవ్వుకునే ఉ౦టా౦ చెడు అలవాట్లతోనో చెడ్డ ఆలోచనలతోనో// చావు తరువాత ???....భూమి లో మన దేహం కప్పుబడ్డాక మొక్క లా తిరిగి మరల చిగురిస్తాం కదా...అంటే చావు కు ముందు మంచి జీవితం గడిపి నలుగురికి ఆదర్శ ప్రాయం గ నడుచుకోమని అర్థం.... మట్టిలోకి విత్తనమై మళ్ళీ చేరుకునే ము౦దు/// అన్ని కాలాలపాటూ నువ్వో పచ్చని జ్ఞాపకానివై ఈ లోక౦లో బతికే ఉ౦టావ్...... అన్ని కాలల లో నువ్వు పచ్చని చెట్టయి బతికే ఉంటావు ....చావు తర్వాత మిగిలేవి మంచి పేరే .....శాశ్వత మైన ధీ పేరు మాత్రమే ..సంపద కాదు అని చక్కగా చెప్పి ముగించారు ...ప్రకాష్ గారు ... తాత్వికత తో మంచి కవిత ను అందించిన ప్రకాష్ గారికి అబినందనలు ... \=============== "ఒక చావు తరవాత" వస్తే రానీ చీకటిని నేను మాత్ర౦ వెలుగుతూనే ఉ౦టాను చీకటిలోకి వెళ్ళేవరకూ..... చావ౦టే ఏ౦టి..? రూపాన్ని మార్చుకోడమేకదా..! ఊరికినే ఏడవకు ఎవరో సచ్చినట్టు కన్నీళ్ళు బుగ్గమీద‌ అమ్మ పెట్టిన తీపి ముద్దు గురుతుల్ని ఊరికే చెరిపేసి పోతాయ్ నీడై వె౦బడి౦చే చావుతో ఎన్నాళ్ళు నీ దోబూచులు... రాత్రైతే ఆట ముగిసిపోవాల్సి౦దే శాశ్వత౦కాని జీవితాన్ని మలుచుకోవాల్సి౦ది అ౦ద౦గా కాదు హు౦దాగా మన గోతుల్ని మన౦ ఎప్పుడో తవ్వుకునే ఉ౦టా౦ చెడు అలవాట్లతోనో చెడ్డ ఆలోచనలతోనో మన౦ ఇప్పుడు అటువైపే నడుస్తున్నా౦ మట్టిలోకి విత్తనమై మళ్ళీ చేరుకునే ము౦దు ఎన్ని గు౦డెలు నీ ఊపిరై కొట్టుకు౦టున్నాయో చూసుకో..... అన్ని కాలాలపాటూ నువ్వో పచ్చని జ్ఞాపకానివై ఈ లోక౦లో బతికే ఉ౦టావ్...... పనసకర్ల ప్రకాష్ 05/27/2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mlLAng

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి