చితి మంటలు _____పుష్యమి సాగర్ ఎందుకు నీలోనువ్వే నరాలన్నింటి ని కలిపి కుట్టుకొని గజ గజ వణికి పోతున్నావు భయం తో ...!!!! కాలేది కట్టే అని తెలిసాక కుడా, జీవితాన్ని ముగించి గుప్పెడు బూడిద గా మారి పోయే క్షణాల కోసం ఎన్ని బాధాపూరిత జీవులు ఎదురు చూడటం లేదు ..!!! సరే , ఇప్పుడు నీ వంతు జ్ఞాపకాలన్నింటి ని , ఎక్కడో ఒక చోట పాతి పెట్టి నీ వాళ్ళ అనుభూతులను గుండె నిండా నింపుకొని పరిగేడుతున్నావు కదా..పర్లేదు , ఎక్కడో ఒక చోట ఈ పరుగు ఆగుతుందని తెలిసి, ఆరిపోయే దీపానికి నునె గా మారి అలాగే ఉండిపోవాలని అర్రులు చాస్తావెందుకు !! శ్వాస వదిలింది మొదలు, ఒక్కో దశ ను దాటుకుంటూ సీతాకోక చిలకలా ఎగురుకుంటూ దుఖపు ప్రపంచపు దారుల గుండా... కళ్ళ నుండి జారిన కన్నీరు ని ...మిగిలిన ఏ కొద్ది సంతోషాలను మరి కొన్ని విరహాలను, కోపాలను , యుద్దాలను నీ సగభాగం తో ...మరి కొన్ని నీ పిల్లల తో సంపూర్ణ జీవితాన్ని కడుపార భుజించాక ... ఇంకా ఆకలి కోసం వెతుకుతావెందుకు ...మరి కొంత కాలం నూకలను ఏరుకొని నివాసం ఏర్పరచు కొవటానికా, చచ్చిపోయే చివరి క్షణం కోసం , ఇప్పటి నుంచే చస్తావు ఎందుకు ?!!!!! కొన్ని ప్రశ్నలు నిజంగా నీ మెడ మీద కత్తి లా వేలాడుతున్నాయి చితి మంటలు ఎప్పుడు రగులుతున్నట్లే ... నీ లో ని భయము ప్రజ్వరిల్లుతూనే వున్నది ...!!!!!! ఇప్పుడు నిన్ను నువ్వు అందులో కాల్చు కుంటావు జావాబు దొరకని కొన్ని ప్రశ్నల కోసం .... అలసిపోయిన మది కాలిపోతుంది నిరంతరం ఆలోచనల మంటల్లో ...!!! మే 5, 2014
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nZiDla
Posted by Katta
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nZiDla
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి