ప్రయాణం _________పుష్యమి సాగర్ ఒక సాయంత్రం కరువుఅయిన శాంతి కోసమో ఏమో , సమాంతర పట్టాల నుంచి ముందుకు ఉరుకుతూ దూకుతున్న రైలు పెట్టె లో నన్ను నేను ఓ మూల గా కుక్కుకొని కూర్చున్నాను ... ఉపిరి ని కాస్త వదిలి నలు దిక్కులా చూసాను గాలిని మింగి కాస్త సేద తీరుదామని నన్ను అమాంతంగా కబళించిన బడుగు జీవులు కళ్ళలో దైన్యం , .ఒంటి కాలు పై తపస్సు ఓటేసిన పాపానికి ఫలితం కాబోలు ...!!! యాతనల వంతెనల నుంచి వడి వడి గా అడుగులేస్తూ ...ఒక్కరికి తీరిక లేదు... అప్పుడు అప్పుడు సజీవ బతుకు చిత్రాలు రంగులేసుకుంటూ మొహం పై చల్లి వెళ్తున్నాయి మలి దశ లో కొడుకు లు ఉమ్మేసిన తండ్రి నడుము వంగి అడుక్కుంటూ త్వరగా మరణపు అంచులను తాకాలని తహ తహ పడుతున్నాడు ...!! మరో గుడ్డి తమ్ముడు పెదాలపై కనిపించని దేవుడి ని తలచుకుంటూ పొట్ట నింపుకునే ప్రయత్నం లో సూటి పోటీ బాణాలు తుడిచేసుకుంటూ అంగీ లో వేసుకుంటున్న దృశ్యాలు !!!! ఇక చాలీ చాలని దుస్తులతో తమ శరీరాన్నే కాదు మనసు ని కప్పుకోలేక ఆకలి తో ఆక్రమించే పులుల మధ్య లో ఆడతనం బేల గా గుక్కపట్టి ఏడుస్తుంది ...!!! ఇలా చిద్రమైన బతుకుల నుంచి పయనిస్తూనే ఉన్నదీ .. తన గమ్యం ఎక్కడో తెలియని ఓ రైలు ...! మే 29, 2014
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mKq8tL
Posted by Katta
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mKq8tL
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి