పద్మ****నా బాల్యం**** జీవితమనే పుస్తకంలో అత్యంత అద్భుతమైన మొదటి పేజీ బాల్యమేనేమో.! అమాయకమైన బాల్యన్ని గేలం వేసి వెనక్కి తెచ్చేసుకోవాలని ఉంది. చిన్నప్పుడు ఉదయం లేవగానే ఇంటివెనకాతలనే ఉన్న రాములులవారి గుడి దగ్గరకు నా ప్రమేయంలేకుండానే నా కాళ్ళు నడిచేసేవి. చెట్టూ చుట్టురా పరుచుకొన్న పారిజాతం పువ్వులతో మాట్లాడేసి గుడి చుట్టూ ఉన్న మొక్కలను ఓసారి కళ్ళతో తడిమేసి, శివాలయం పక్కన ఉన్న చెరువుదగ్గరకు వెళ్ళి మునికాళ్ళపై కుర్చుని నిశ్చలంగా ఉన్న నీటిలో నా ప్రతిబింబాన్ని చూసుకోని మురిసిపోయేదాన్ని. చిన్న చిన్న రాళ్ళను నీటిలోకి రువ్వుతూ ఆ తరంగాలను చూస్తూ తరంగాలు దూరందూరంగా పెద్ద వృత్తంలా వాటిలో మళ్ళీ రువ్విన రాయి దూసుకొని పోతూ ఇంకో వృత్తం అలల తరంగాలో ఏదో తెలియని గమ్మత్తు. నీటిలో రివ్వు రివ్వున తిరిగే చేపపిల్లలు తడిచిన నా పాదాలను ముద్దు పెట్టుకొంటూంటే ,వాటిని తాకుదాం అనే లోపలే చట్టుక్కున అందకుండా జారిపోయేవి. ఇప్పుడు కూడా నాకు తెలియకుండానే కాలం చేతి వేళ్ళ మద్య జారే ఇసుకలా జారిపోతుంది నన్ను వెక్కిరిస్తూ... పేపర్ పడవల మద్య ఒదిగిన బాల్యం, బ్రతుకు నావకు చుక్కానిలా మారి పోయింది. 21|4|14
by Padma Bikkani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RDT6RA
Posted by Katta
by Padma Bikkani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RDT6RA
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి