బుచ్చిరెడ్డి బాపు ( హనుమాండ్ల బాయి - 2 ) ______________________ఆర్క్యూబ్ ఊరిని మోసెటొళ్ళు తరానికొక్కరుంటరు మా " గంగిపల్లి"కి బుచ్చిరెడ్డి బాపు ఆ బాయినే పంచుకొని ఆ బాయి కింది పొలాలనే పారిచ్చి ఆ ఒడ్ల పొంటనే తిరిగి తిరిగి ఆ పొలాల బువ్వనే తిని దానాత్మ పంచుకున్న మోతుబరి రైతు అచ్చగాల్లకు బిచ్చగాల్లకు అన్నం మెతుకు చేతులను గీరెలు జేసి మాటను ముల్లుగర్ర జేసి దున్నపోతులకు నాగలి గట్టి ఊరిని సాగు జేసిన కాపు బడై గుడై బాయి పొలం పెరడై ఇవ్వడమే తెలిసిన నదిలా సాగిపోయిండు ధర్మాత్ముడు ఐతేంది ..ఇది కాని కాలం గుడి మీదా బడి మీదా ఉడుం రాజకీయం బాపుకు పక్షవాతం ఈ ముచ్చట బాయి కెట్ల తెలిసిందో ఎండలకెండి దరుల బొక్కలు తేలి ఆ పిరిసెట్టెడు నీళ్ళల్ల ఎన్నడూ కనబడని బొమ్మ చాపలు నాలుగు - అవిటికెట్ల తెలిసినయో రాయి పెగిలింది అటు ఆఫీసొరిగి ఇటు హనుమాండ్ల గద్దె కూలి నిండా పూడిక పురా ఊటలు మింగి సర్కారు తుమ్మ అది బాయో బొందో ఏదీ గుర్తువట్టకున్నది కొడుకా- అండ్ల నీకు ఈత నేర్పాలనుకున్నగదరా కలిసి -సిమ్ముల మీంచి సొర్రేయాలనుకున్న గదరా ఆ భాగ్యమింకా మనకు లేకపాయే అయ్యలూ జెరంత పిల్లలనటు ఒంటరిగ పోనీయకుర్రి గుండె చెదురుతరు గిట్లనే తాపకొక్కరచ్చి ఆఖరి చూపు చూసి పోతున్నరు పాణమింక పోలేదు ఎవల కోసమో తండ్లాడుతంది కొడుకా-నువ్వు రా సూసి దండం బెట్టుకుందువు గాని * * * *
by Arcube Kavi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ss5X8U
Posted by Katta
by Arcube Kavi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ss5X8U
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి