జీవితంలో.... ఈదాలని నదులన్ని కట్టగట్టుకుని దూకాయ్ సముద్రంలో అన్నీ కన్నీళ్ళై పోయాయి బడబాలనంలో మరిగి ఆవిరై లేని ఆకాశంలో జల్లెడ పట్టిన జ్ఞాపకాలై నేలరాలిపోయాయి నో రిటర్న్స్ , నో రిపెంటెన్స్ ఒక్క చుక్క కూడా అక్షరమ్ రాలలేదు అన్ని నీళ్ళున్నా ఇంత తడి లేదు ఎన్ని కాగితపు దస్తీలు పిగిలిపోతే ఏంది ఒడిలోకి తీసుకున్న చోటల్లా హృదయ కాసారాలైనయి పచ్చటి రుతువులైనయి ఎగిరొచ్చిన మేఘాల పల్లకీలలో రెక్కలొచ్చిన పాటల చినుకులైనయి కొన్ని వేళ్ళకు, కొన్ని ఆకులకు కొన్ని పక్షుల రెక్కల్లో,కొన్ని ఇసుక తిన్నెల్లో కొన్ని కంటికొలుకుల్లో, కొన్ని పచ్చి ఊపిరితిత్తుల్లో కొన్ని పెదవికంటిన మాటల్లో, ఇంకొన్ని మొలకలెత్తిన చిగుళ్ళలో నీటి చుక్కలు కొన్ని
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UIJtCw
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UIJtCw
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి