పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, జూన్ 2014, మంగళవారం

Kapila Ramkumar కవిత

సాహిత్య ప్రయోజనం || కీ.శే.డా||కె.హరీష్ (సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షుడు)|| సామాజిక ఉత్పత్తిలో ఓకరినొకరు ఎరుకపరచుకోటానికి వాడేది భాష, మాట, పాటా మానవశ్రమ నుండి సమిష్టి తత్వం నుండి పుట్టాయనేది నిర్వివాదాంశం. సామాజిక పరిణామ క్రమంలో ఉత్పత్తి రూపాలూ, విధానాలు మారాయి. శ్రమ విభజన వర్గ విభజనగా మారింది. అది క్రమేణా సమిష్టీ తత్వం నుండి వ్యక్తి తత్వమయింది/ వ్యక్తులకు సొంత ఆస్తితోపాటు కవిత్వం కొద్దిమంది కవుల, ఛందస్సు గొలుసుల్లో చిక్కువడింది. క్రమేణా కవిత్వం ఆధిపత్య వర్గాల ఆనందం కోసం, ప్రజల్ని అంధవిశ్వాసాల్లో ముంచటం కోసం ఉపయోగపడింది. కవిత్వానికి, కళలకూ కూడ వర్గ స్వభావం వుంటుంది. అవి కూడ అంతస్థులూ, అంతరాలు, కులాలు పాటిస్తాయి. భాషయొక్క ఉపరితలమే ' కవిత్వం '. వర్గాధిపత్యాలతో పాటు కవితారూపాలలో కూడ మార్పు వచ్చాయి. మారుతున్న ఈ కళారుపాన్నే మనం పద్యం అన్నాం. గేయం అన్నాం. వచన కవిత అన్నాం. అభ్యుదయ సమాజానికి రూపాలను సమాంతరంగా కళలు, వాటి రుపాలు ( కాంటెంట్లు) మారుతూనే వుంటాయి. కళా రుఫాలు సామాజిక వృక్షంపై విరబూసి వికసించే పూలు. ఈ గుర్తింపు కలిగిన తరువాత కొన్నీ కళలు ప్రజల పక్షాన నిలబడతాయి. కొన్ని పాలకవర్గాలను అంటకాగి వాటి కొమ్ము కాస్తుంటాయి. ఈ చారిత్రక నేపథ్యం సాహితీ ప్రియులందరికి తెలుసు. కళకైనా, సాహిత్యానికైనా, మమతం సమత, శాంతి మానవాభ్యున్నతిని మించిన మరొక లక్ష్యం మరొకటి వుండదు, వుండకూడదు. అలాంటి ఉత్తమ సాహిత్యాన్ని, కళా సంస్కృతిని విస్తరింపచేయటమే సాహిత్యకారుల ముఖ్య లక్ష్యం, కర్తవ్యం. '' ప్రజల నుంచి ప్రజల కొరకు '' అనేది ఇక మన నినాదం, విధానం కావాలి. ఈనాడు మనం ఒకానొక సంక్లిష్టమైన మలుపులోవున్నాం. సాహిత్యాన్ని, మీడియాను, మోసపూరితం చేస్తున్న వ్యాపారపు విలువలు ఒకవపు, సామ్రాజ్యవాదుల ఆర్థిక సాంస్కృతిక దాడులు మరొక్ వైపు, మత ఛాందస ఆదిమ యుగాల దాడి మరొక వైపు నిత్యం మనం ఎదుర్కోటున్నాం. ప్రపంచీకరణ, ఉగ్రవాదం, మతోన్మాదం ముప్పేట దాడులు చేస్తూనే వున్నాయి. ఈ దాడినుంచి మనలను మనం మన సంస్కృతిని, సాహిత్యాన్ని మనమే కాపాడుకోవలసిన ఆవశ్యకత మరింత పెరిగింది. ఈ విషయాన్ని మానవాభ్యుదయాన్ని కోరే సాజితీ ప్రియులు గుర్తించాలని మరీమరీ కోరుతున్నాను. ఆ విలువలకు వ్యతిరేకంగా పోరాడవలసిన ఆగత్యాన్ని గుర్తుచేస్తూ సెలవు తీసుకుంటాను. _______________________________________________________ ( 2001 సాహితీ స్రవంతి వార్షికోత్సవ సభలో నాటి గౌరవాధ్యక్షులు డా||కె. హరీష్‌ గారి ప్రసంగం నుండి కొంత భాగం.....వారి స్వంత నోట్‌ పేడ్ నుండి ) _______________________________________________________ 17-6-2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qokYHr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి