పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మే 2014, సోమవారం

Viswanath Goud కవిత

ఆ రాత్రి కల'త'నిద్రలో తనతో కలసి కొన్ని కాలాలు వెనక్కి నడిచి ఆనాటి తొలి పరిచయం అనుభవాలను పలకరించి వస్తూ వస్తూ తనతో గడిపిన తీపి గురుతులను కళ్ళ ఖజానాలోనే బధ్రపరిచి వస్తుంటే తన తలపుల దారిలో.... రాత్రి కురిసిన నిద్ర వర్షానికి కళ్ళ చెట్టుకి విరగకాసిన తన కలలన్నీ తెంపి మూటగట్టుకుని తీసుకొచ్చి నా కనుపాపలకు ఆకలి తీర్చాను. తనిప్పుడు ఎక్కడుందో అన్నమాటే గాని తనెప్పుడు నా తలపుల్లో తచ్చాడుతూనే ఉంటుంది తను దూరమైనా తను విడిచిన శ్వాస తాలూకూ పరిమళమింకా నా మదినిండా పరుచుకుని గుభాళిస్తునే ఉంది ఆ రాత్రి వెన్నెలను తాగిన నిండుపూర్ణిమలా తన పూర్ణభింబం చిరునగవుల వెలుగులతో ప్రకాశిస్తుంటే తన జ్ఞాపకాలను అబ్బురపడి చూస్తూ తెల్లారేదాక కలలోనే తిష్టవేసుకూర్చున్నట్లు గుర్తు తనను కలవాలనుకున్న ప్రతిసారి నిదురనే ఆశ్రయిస్తాను, అదే తనకేసి దారిచూపే దిక్సూచిలా తనెక్కడున్నా నన్నక్కడికి తీసుకెళుతుంది.. తనను చూశాక నా కళ్ళతో ఓమారు కలను ముద్దాడి ప్రేమగా ఆలింగనం చేసుకుని గుండెలో సమాధయిన తన జ్ఝాపకాలపై కన్నీటి పూరేకులను జల్లి వచ్చాను.... అందరు సూర్యోదయపు వెలుగుతో లేస్తుంటే నేను నైరాశ్యపు చీకటిలోకి జారిపోతూ..తను లేని శూన్యప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టాను.! విశ్వనాథ్ 05MAY14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uqj0XM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి