పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మే 2014, సోమవారం

Uday Dalith కవిత

సరస్వతిని చదువుల తల్లిగా కొలిచే దేశం ఐతే మాత్రం సగానికి పైగా ఆడవాళ్లకు చదువే లేదు భరతమాత అని దేశాన్నే పూజిస్తాం ఆ పేరుతోనే ఆడవాళ్లను అణగత్రొక్కుతాం గుళ్లు గోపురాలు ఎన్నో కట్టిస్తాం నీ చెల్లికి తల్లికి స్వేఛ్ఛ ఇవ్వడానికి కూడా ఒప్పుకోం ఆదిశక్తి పరాశక్తి అని వల్లెవేస్తాం ఆడవాళ్ల హక్కులన్నా రిజర్వేషన్లన్నా ఆమడదూరంలో వుంటాం సమానత్వం గురించి గొంతు చించుకు అరుస్తాం ఆడదంటే శృంగార వస్తువే కానీ వ్యక్తిత్వం వున్న మనిషిగా గుర్తించం పెళ్లి చేసుకుని భర్తకు సేవ చేసుకుని అత్త మామలతో అణకువ ప్రదర్శించే ఆడవాళ్లంటేనే సమాజానికి ఎక్కడలేని మర్యాద చదువుకుంటే ఉద్యోగం ఎందుకు యింట్లో మగాడు వుంటే బయటకు తానెందుకు సంసారాన్ని మించిన వేరే ప్రపంచం ఎందుకు ఝాన్సీరాణి రుద్రమ్మదేవిల చరిత్రలు పుస్తకాల్లో చదివి వదిలేద్దాం సీతా అనసూయల కధలతో పవిత్రత పుణ్యస్త్రీ పేర్లతో వంటిటికి మహారాణిని చేద్దాం ఏపూజలు వ్రతాలు దేవుళ్లు దేవతలు బానిసత్వాన్ని నీకు వరంగా యిచ్చారో వాటి నుండి విముక్తి కానంతవరకు స్వేచ్ఛకై పోరాటం చేయనంతవరకూ ఈ హింస ఆగదు నీ తలరాత మారదు నవ్వుతూ అనుభవిస్తున్నంత కాలం నవ్వులపాలవుతూనే వుంటావు ఉదయ్ 19.05.14

by Uday Dalith



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p57P2I

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి