పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మే 2014, సోమవారం

Girija Nookala కవిత

మనసు లేని మరబొమ్మలు మానవత్వం చచ్చిపోయింది పిశాచాల్లా బ్రతకండి రోజూ నెత్తురు ధారలు తెగి పడిన శరీరాలు కాలిన మాంసపు ముద్దలు చూసి కడా చలించకుండా మీ పనిలో మీరు తిరగండి కులం,మతం,రంగు,రూపు కసి,కోపం,క్రోధం,అసూయ, ప్రతినిత్యం నింపుకొని విషపు మనసుల మలిన శ్వాసలతో కాలుష్యం నింపుతూ నడవండి దూరశ్ర్వణాలు,దూరదర్సనాలు, ఫేస్ బుక్ పలకరింపులు దగ్గర కాలేని వాట్సాప్ పరిచయాలు, పరిమళం లేని ప్రణయ ప్రలాపాలు డేటింగులు,ఔటింగులలో కాలుతున్న యవ్వనంతో మనసు లేని మరబొమ్మల్లా డబ్బు చుట్టూ తిరగండి. డాలర్ల రిప రిపలు,విదేశీ యానాలు పట్టు చీర్ల పెర పెరలు మే'కప్పు మఖాలు హొదాలు చాటే డిజైనర్ నగలు సినిమా సెట్టింగుల కల్యాణ మండపాలు, ముగ్ధ శిశిర అమాయక ఆనందం పొగొట్టుకొన్న లేటు వ్యాపార పెళ్ళి నటించండి. రెండు జీవితాల ఆత్మీయ బంధం నూరేళ్ళ కాసుల పంటై సహజ భావాల రంగులు కోల్పోయిన ఇంద్ర ధనస్సును విడియోలలొ చూసుకోండి. మాత్రుత్వం,మానవత్వం.రెడింటికీ దగ్గర అనుభందం ఇద్దరు వద్దని,ఒక్కరు కాడా ఎందుకని కంటే భారమని,ఆనందాలకి అడ్డని పిల్లలు లేని ప్లాస్టిక్ నవ్వులతో పూవులు పూయని ఎడారిలో ఆనందంగా గడపండి అందరిలో ఒంటిరై జంటకి కూడా దూరమై నీకు నువ్వే భరమై నిన్ను నువ్వే ప్రేమించుకోలేని అనాధ జీవివై శ్వాస మాత్రమే మిగిలిన శవమై ఏకాకివై,చచ్చే వరకు చితివై చచ్చినట్టు బ్రతకండి. కన్నీళ్ళు కడా తుడవలేని కాసులు చూసుకొని తనివి తీరా ఏడవండి. ఈ మధ్య పెళ్ళి ఒద్దు,పిల్లలు ఒద్దు లివింగ్ ఇన్ రెలేషన్లు,లేటు వ్యపార పెళ్ళిళ్ళు,చిన్న వయసులో డేటింగులు... మన చక్కటి సమాజ వ్యవస్థ ఏమై పోఅతున్నాదన్న వేదనతో.....

by Girija Nookala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jv0mus

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి