జీవుడు || టి. శ్రీవల్లీ రాధిక కనులు తెరచి చూస్తున్నాను కదా కదలిక కొంతైనా వుందనుకుంటారు కవితలేవో వ్రాస్తున్నాను కదా కలలు కొన్నైనా మిగిలాయనుకుంటారు మాటల గునపాలతో త్రవ్వితే కన్నీటి జల వుబుకుతుందనుకుంటారు ప్రపంచంలో మసలుతున్నాను కదా ప్రాణమింకా నిలిచి వుందనుకుంటారు కాటికివతల కనిపిస్తున్నాను కదా హృదయమింకా పగలలేదనుకుంటారు పాత నాటకమే ప్రదర్శిస్తే పొరపాటున పలుకుతాననుకుంటారు *** (18/5/2014 ఆంధ్రజ్యోతి ఆదివారం లో ప్రచురితం)
by Srivalli Radhika T
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gftepK
Posted by Katta
by Srivalli Radhika T
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gftepK
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి