పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మే 2014, సోమవారం

Ramaswamy Nagaraju కవిత

అనువాద కవిత్వం : ......|| కాంతి / Light ||..... కాంతి ! అనంత కాంతి ! లేదిక చీకటికి చోటు . జీవన అంధ తమస్సులు విడుతున్నవి గుహాంతర తిమిర మర్మాలు విడివడుతున్నవి అంతుచిక్కని గత అవిద్యా అగాధాలు ఆశావహ చలిత కలికల్లా జ్వలిస్తున్నవి . కాంతి!కాలాతీత పరివర్తనాతీత సుదూర కాంతి! బంధిత పవిత్ర రహః కవాటాలు తెరుచుకుంటున్నవి అనంతం లో జ్వలిస్తున్న వజ్రాత్మ కాంతి నా అంతరంగం లో ప్రకంపించి మరణాతీత అమర సుమమై వికసిస్తున్నది ! కాంతి! నరనరాన నర్తిస్తున్న వైవశ్య కాంతి ! కాంతి! చిరంతన చింతనానంత కాంతి ! ప్రతి తాడిత రజోగుణ కణం మౌన జ్వాలై అనశ్వర జీవన స్పృహను పదిల పరుస్తున్నది. ఒక మహాద్భుత కాంతి కడలిలో నా ఈ కదలిక నా అగాధాలనూ ఆతని అనంత శిఖరాలనూ అనుసంధిస్తూ. మూలం : మహర్షి అరవింద ఘోష్ (Sri Aurobindo collected poems ) సేచ్చానువాదం : నాగరాజు రామస్వామి.

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TlRiO3

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి